Modi 3.0 Government: 71 మందితో మోదీ మెగా కేబినెట్, ఏ రాష్ట్రం నుంచి ఎంతమంది, ఎవరెవరు

Modi 3.0 Government: కేంద్రంలో మోదీ 3.0 ప్రభుత్వం ఏర్పడింది. బొటాబొటీ మెజార్టీతో అధికారం కావడంతో ఎన్డీయేలోని భాగస్వామ్య పక్షాలకు ఈసారి మంత్రిపదవులు దక్కాయి. దేశంలో ఏ రాష్ట్రం నుంచి ఎంతమంది, ఎవరెవరికి మంత్రి పదవులు వరించాయో తెలుసుకుందాం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 10, 2024, 05:56 AM IST
Modi 3.0 Government: 71 మందితో మోదీ మెగా కేబినెట్, ఏ రాష్ట్రం నుంచి ఎంతమంది, ఎవరెవరు

Modi 3.0 Government: నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. 71 మందితో నూతన మంత్రివర్గం ఏర్పడింది. వీరిలో 30 మంది కేంద్రమంత్రులు కాగా ఐదుగురు ఇండిపెండెంట్ హోదా కలిగినవాళ్లు. మరో 36 మంది కేంద్ర సహాయ మంత్రులున్నారు. ఈ నేపధ్యంలో ఏ రాష్ట్రం నుంచి ఎవరెవరికి అవకాశం లభించిందో చూద్దాం.

ఉత్తరప్రదేశ్ నుంచి అత్యధికంగా 9 మందికి మోదీ కేబినెట్‌లో అవకాశం లభించింది. వీరిలో హర్దీప్ సింగ్ పూరీ, రాజ్‌నాధ్ సింగ్, జయంత్ చౌధురి, జితిన్ ప్రసాద్, పంకజ్ చౌధురి, బీఎల్ వర్మ, అనుప్రియ పటేల్, కమలేష్ పాశ్వాన్, ఎస్పి సింగ్ బఘేల్ ఉన్నారు. ఇక రెండవ స్థానంలో బీహార్ నుంచి 8 మంది ఉన్నారు. చిరాగ్ పాశ్వాన్, గిరిరాజ్ సింహ్, జతిన్ రామ్ మాంఝీ, రామ్‌నాథ్ ఠాకూర్, లలన్ సింహ్, నిత్యానంద్ రాయ్, రాజ్ భూషణ్, సతీష్ దూబే ఉన్నారు. 

ఇక మూడవ స్థానంలో మహారాష్ట్ర నుంచి ఆరుగురున్నారు. పీయూష్ గోయల్, నితిన్ గడ్కరీ, ప్రతాప్ రావ్ జాదవ్, రక్షా ఖడ్సే, రామ్‌దాస్ అథవాలే, మురళీధర్ మోహోల్‌లకు కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించింది. నాలుగవ స్థానంలో కర్ణాటక నుంచి నిర్మలా సీతారామన్, హెచ్‌డి కుమారస్వామి, ప్రహ్లాద్ జోషి, శోభా కందర్లాజే, వి సోమన్న ఉన్నారు. ఐదవ స్థానంలో మధ్యప్రదేశ్ నుంచి శివరాజ్ సింహ్ చౌహాన్, జ్యోతిరాదిత్య సింధియా, సావిత్రి ఠాకూర్, వీరేంద్ర కుమార్ ఉన్నారు. ఆరవ స్థానంలో రాజస్థాన్ నుంచి రాజేంద్ర సింహ్ శెఖావత్, అర్జున్ రామ్ మేఘవాల్, భూపేంద్ర యాదవ్, భాగీరధ్ చౌధరి ఉన్నారు. 

ఇక ఏడవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురున్నారు. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, కింజరపు రామ్మోహన్ నాయుడు, భూపతిరాజు శ్రీనివాసవర్మ ఉండగా తెలంగాణ నుంచి ఇద్దరికి స్థానం లభించింది. వీరిలో జి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఉన్నారు. హర్యానా నుంచి  మనోహర్ లాల్ ఖట్టర్, రావ్ ఇంద్రజీత్ సింహ్, కృష్ణపాల్ గుర్జర్ ఉన్నారు. పశ్చిమ బెంగాల్ నుంచి శాంతను ఠాకూర్, సుకాంత్ మజూందార్ ఉన్నారు. అస్సోం నుంచి శర్బానంద్ సోనోవాల్, పబిత్రా మార్గోహిత ఉన్నారు. జార్ఘండ్ నుంచి సంజయ్ శేఠ్, అన్నపూర్ణ దేవి ఉంటే కేరళ నుంచి సురేశ్ గోపి, జార్జ్ కురియన్‌లకు అవకాశం లభించింది. ఒడిశా నుంచి అశ్విని వైష్ణవ్, ధర్మేంద్ర ప్రదాన్, జువల్ ఓరమ్ ఉన్నారు. 

హిమాచల్ ప్రదేశ్ నుంచి జేపీ నడ్డా, గోవా నుంచి శ్రీపాద నాయక్, అరుణాచల్ ప్రదేశ్ నుంచి కిరణ్ రిజిజు, జమ్ము కశ్మీర్ నుంచి జితేంద్ర సింహ్, తమిళనాడు నుంచి ఎల్ మురుగన్, పంజాబ్ నుంచి నవనీత్ సింహ్ బిట్టూ, ఢిల్లీ నుంచి హర్ష మల్హోత్రా, ఉత్తరాఖండ్ నుంచి అజయ్ టమ్టా, ఛత్తీస్‌గఢ్ నుంచి తోఖన్ సాహు ఉన్నారు. 

Also read: kangana ranaut: లేడీ కానిస్టేబుల్ కు గోల్డ్ రింగ్, జాబ్ ఆఫర్.. కంగానా రనౌత్ ఘటనలో షాకింగ్ ట్విస్ట్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News