NEET 2021 exam writing scam: నీట్ పరీక్షల్లో భారీ కుంభకోణం.. ఒక్కో విద్యార్థితో రూ. 50 లక్షలకు డీల్

Exam writing scam in NEET UG 2021: మెడికల్ కాలేజీల్లో మెడిసిన్ అడ్మిషన్స్ కోసం నిర్వహించే నీట్‌ పరీక్షలకు సంబంధించి భారీ కుంభకోణానికి పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టయింది. మహారాష్ట్రలోని ఆర్కే ఎడ్యుకేషన్ కెరీర్ గైడెన్స్ అనే కోచింగ్ సెంటర్ నిర్వాహకులే ఈ కుంభకోణానికి తెరతీసినట్టు గుర్తించిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)..ఈ నేరానికి పాల్పడుతున్న ముఠాసభ్యులను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 23, 2021, 05:01 PM IST
NEET 2021 exam writing scam: నీట్ పరీక్షల్లో భారీ కుంభకోణం.. ఒక్కో విద్యార్థితో రూ. 50 లక్షలకు డీల్

Exam writing scam in NEET UG 2021:  మెడికల్ కాలేజీల్లో మెడిసిన్ అడ్మిషన్స్ కోసం నిర్వహించే నీట్‌ పరీక్షలకు సంబంధించి భారీ కుంభకోణానికి పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టయింది. మహారాష్ట్రలోని ఆర్కే ఎడ్యుకేషన్ కెరీర్ గైడెన్స్ అనే కోచింగ్ సెంటర్ నిర్వాహకులే ఈ కుంభకోణానికి తెరతీసినట్టు గుర్తించిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)..ఈ నేరానికి పాల్పడుతున్న ముఠాసభ్యులను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తోంది. 

SCAM in NEET exams: ఏంటా కుంభకోణం ?
నీట్ పరీక్షలకు హాజరు కావాల్సిన అభ్యర్థికి బదులుగా మరొక తెలివైన మెడిసిన్ విద్యార్థి చేత పరీక్ష రాయించి ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మెడిసిన్ సీటు ఇప్పించేలా ఆ కోచింగ్ సెంటర్ నిర్వాహకులు ఆశావహులైన అభ్యర్థుల నుంచి ఒక్కొక్కరికి రూ.50 లక్షలు చొప్పున వసూలు చేస్తున్నట్టు సీబీఐ దర్యాప్తులో తేలింది. కోచింగ్ సెంటర్ డైరెక్టర్ పరిమళ్ కొత్పల్లివార్‌తో పాటు మోసపూరితంగా నీట్ పరీక్షలు (NEET exams 2021) రాసి మెడిసిన్ సీటు పొందాలని కుట్రపన్నిన పలువురు విద్యార్థులపై కేసులు నమోదు చేసి వారిని అరెస్ట్ చేసినట్టు సీబీఐ అధికారి తెలిపారు. 

Also read : Scary Video: పెద్ద చేప అనుకున్నారు.. కానీ వల వేసి చూస్తే.. చెప్తే కాదు.. చూస్తే థ్రిల్ అవుతారు..!

Post dated cheques: పోస్ట్ డేటెడ్ చెక్కులతో పాటు టెన్త్, ఇంటర్ సర్టిఫికెట్లు..
కుంభకోణంలో భాగంగా తమను ఆశ్రయించిన విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కోచింగ్ సెంటర్ డైరెక్టర్ పరిమళ్ కొత్పల్లివార్ పోస్ట్ డేటెడ్ చెక్కులు (Post dated cheques) తీసుకున్నట్టు తేలింది. ఒప్పందం ప్రకారమే పని పూర్తయ్యాక మిగతా బ్యాలెన్స్ చెల్లించేందుకుగానూ షూరిటీగా విద్యార్థుల టెన్త్, ఇంటర్మీడియెట్ సర్టిఫికెట్లను కోచింగ్ సెంటర్ (Coaching centres) నిర్వాహకులు తీసుకున్నారని సీబీఐ ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నట్టు సమాచారం.

నీట్ పరీక్షలు (NEET Exams) రాసే విద్యార్థుల పరీక్ష ఐడీ, పాస్‌వర్డ్‌ల వివరాలు సేకరించి ఎవ్వరికీ అనుమానం రాకుండా అభ్యర్థుల ఫొటోలు, వారి స్థానంలో పరీక్షలు రాసే నకిలీ అభ్యర్థుల ఫొటోలను మార్ఫింగ్ చేసి మరీ మోసాలకు పాల్పడుతున్నారు. స్పష్టమైన సమాచారంతోనే ఈ ముఠాను అరెస్ట్ చేసినట్టు సీబీఐ (CBI) అధికారులు తెలిపారు.

Also read : Video: దేశ సాంప్రదాయానికి అవమానం.. చీర కట్టుకుందని హోటల్ కు నో ఎంట్రీ..! నెటిజన్లు ఆగ్రహం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News