NEET UG 2024 Counselling Schedule: దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ప్రవేశానికి ఎప్పుడెప్పడా అని ఎదురు చూస్తున్న NEET UG 2024 Counselling Schedule విడుదలైంది. ఆగస్టు 14 నుంచి దేశవ్యాప్తంగా అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు మొదటి వారంలో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుంది.
నీట్ యూజీ 2024 పరీక్ష పేపర్ లీకేజ్, గ్రేస్ మార్కుల గందరగోళం, ఫిజిక్స్ విభాగంలో ఓ ప్రశ్నకు రెండు సమాధానాల వివాదం, సుప్రీంకోర్టులో విచారణ అనంతరం ఎట్టకేలకు నీట్ యూజీ కౌన్సిలింగ్ ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ లభించింది. నేషనల్ మెడికల్ కమీషన్ ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 710 ప్రభుత్వం, ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఉన్న 1.10 లక్షల ఎంబిబిఎస్ సీట్ల కోసం కౌన్సిలింగ్ ఆగస్టు 14 నుంచి ప్రారంభం కానుంది. 1 లక్షా 10 వేల ఎంబిబిఎస్ సీట్లతో పాటు 21 వేల బీడీఎస్ సీట్లు భర్తీ చేయనున్నారు. ఆల్ ఇండియా కోటా 15 శాతం సీట్లతో పాటు సెంట్రల్ యూనివర్శిటీ, ఎయిమ్స్, జిప్ మెర్ సీట్లు భర్తీ చేయనున్నారు.
నీట్ యూజీ 2024 కౌన్సిలింగ్ షెడ్యూల్ ఇలా
మొదటి రౌండ్ కౌన్సిలింగ్‌కు ఆగస్టు 14 నుంచి ఆగస్టు 21 వరకూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 23వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది. అడ్మిషన్ లభించిన విద్యార్ధులు ఆగస్టు 24 నుంచి ఆగస్టు 29 వరకూ కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది. ఇక రెండవ విడత కౌన్సెలింగ్ సెప్టెంబర్ 5న రిజిస్ట్రేషన్ ప్రారంభమై సెప్టెంబర్ 12 వరకూ ఉంటుంది. సెప్టెంబర్ 13న కేటాయింపు ఉంటుంది. రెండో విడతలో అడ్మిషన్ లభించిన విద్యార్ధులు సెప్టెంబర్ 14 నుంచి 20వ తేదీలోగా ఆయా కళాశాలల్లో చేరాలి. ఇక మూడో విడత కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అక్టోబర్ 16 నుంచి 20 వరకూ ఉంటుంది. 23వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది. సెప్టెంబర్ 24 నుంచి 30వ తేదీలోపల కళాశాలల్లో చేరాలి.
తెలంగాణలో మొత్తం 26 ప్రభుత్వ కళాశాలలు, 30 ప్రైవేట్ కళాశాలలు ఉండగా 8,490 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 26 ప్రభుత్వ కళాశాలల్లో 15 శాతం సీట్లు జాతీయ కోటాలో భర్తీ చేయగా మిగిలినవి రాష్ట్ర విద్యార్ధులతో భర్తీ చేస్తారు.
Also read: NABARD Jobs 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, NABARDలో మేనేజర్ ఉద్యోగాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook