Onion Prices Hike: ఉల్లి మరోసారి కన్నీరు తెప్పిస్తోంది. ఆకాశాన్నంటుతున్న ఉల్లిధరలతో సామాన్యుడి కన్నీరు చిందిస్తున్నాడు. దిగుబడి తగ్గడంతో డిమాండ్ పెరిగి ధరలు ఆకాశాన్ని చేరుతున్నాయి.
దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ఉల్లిధరలు(Onion Prices)రోజురోజుకూ పెరుగుతూ పోతున్నాయి. నిన్నటి వరకూ కిలో ఉల్లి 20-25 రూపాయలుండేది. ఇప్పుడు ఏకంగా 40-45 రూపాయలు పలుకుతోంది. ఆకాశాన్నంటుతున్న ఉల్లిధరలు సామాన్య, మధ్య తరగతి ప్రజలకు కంట నీరు తెప్పిస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలకు దిగుబడి భారీగా తగ్గిపోయింది. ఫలితంగా డిమాండ్ ఎక్కువై ధరలు పెరిగిపోయాయి. నాణ్యతను బట్టి కొన్ని ప్రాంతాల్లో కిలో ఉల్లి 60 రూపాయలు కూడా పలుకుతోంది.
ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో నిల్వచేసిన పాత ఉల్లిపాయలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉండటంతో కొందరు నేరుగా విదేశాలకు తరలిస్తున్నారు. మరోవైపు అకాల వర్షాలకు ఉన్న పంటలు నాశనమయ్యాయి. నాట్లు వేసిన ఉల్లి చేతికందేందుకు మరికొంత సమయం పట్టనుంది. ప్రస్తుతం పంట దశలో ఉన్న ఉల్లి చేతికి అందేవరకూ ఉల్లికొరత తప్పదని..ధరలు ఇంకా పెరగవచ్చని వ్యాపారవర్గాలు చెబుతున్నాయి. మహారాష్ట్ర(Maharashtra), కర్నాటక రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు ఉల్లిపంటలు తీవ్రంగా నష్టమయ్యాయి.
అటు ఏపీ, తమిళనాడు, మద్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాల(Heavy Rains)కారణంగా చేతికొచ్చిన ఉల్లిపంట ఎందుకూ పనికిరాకుండా పోయింది. సాధారణంగా నవంబర్ మొదటివారంలో కొత్తి ఉల్లి మార్కెట్లో వస్తుంటుంది. వర్షాల వల్ల పంటలు నాశనమవడంతో కొత్త పంట వచ్చేందుకు మరింత సమయం పట్టనుంది.లాక్డౌన్(Lockdown)సమయంలో కూడా ఉల్లిధరలు ఆకాశాన్నంటేశాయి. ఏకంగా కిలో ఉల్లి 100 రూపాయలకు చేరుకున్న పరిస్థితి. ఆ తరువాత క్రమంగా తగ్గిపోయింది. ఇప్పుడు వర్షాల కారణంగా మరోసారి ఉల్లిధరలు పెరుగుతుండటంతో ఆందోళన కలుగుతోంది.
Also read: Facebook: ఫేస్బుక్ సీఈవో మా జుకర్‌బర్గ్ రాజీనామా చేయనున్నారా, నిజమెంత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి