Supreme Court JCA Recruitment: భారతదేశానికి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. దేశ రాజధాని న్యూఢిల్లీలోని సుప్రీంకోర్టులో భారీగా ఉద్యోగాలు పడ్డాయి. కేవలం డిగ్రీ ఉంటే చాలు న్యాయస్థానంలో ఉద్యోగిగా అవకాశం పొందవచ్చు. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకుండానే సులువుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించవచ్చు. భారీగా జీత భత్యాలు.. అత్యధిక సెలవులు ఉండే ఈ ఉద్యోగానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Ration Cards: తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్.. త్వరలో అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు
పోస్టులు ఎన్నంటే..?
సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో డిగ్రీ అర్హతతో జూనియర్ కోర్టు అసిస్టెంట్ (గ్రూప్-బి నాన్ గెజిటెడ్) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఇప్పటికే దరఖాస్తులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే వారికి డిగ్రీ ఉంటే చాలు. దానికితోడు ఇంగ్లిష్ టైపింగ్ స్కిల్ ఉండాలి. సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా జూనియర్ కోర్టు అసిస్టెంట్ (గ్రూప్-బి నాన్ గెజిటెడ్) పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 241 జూనియర్ కోర్టు అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది.
Also Read: Schools Holiday: ఈనెల 19న పాఠశాలలకు సెలవు.. ఎందుకంటే తెలుసా?
అర్హతలు ఇవే!
సుప్రీంకోర్టు జూనియర్ కోర్టు అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. కనీస కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. టైపింగ్ స్కిల్ అదనంగా వచ్చి ఉండాలి. 35 పదాలు నిమిషానికి టైప్ చేసే స్కిల్ చేయాల్సి ఉంది. వయో పరిమితి మార్చి 8, 2025వ తేదీ నాటికి తప్పనిసరిగా 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వరకు వయసు మినహాయింపు ఉంది.
దరఖాస్తు రుసుము
ఆన్‌లైన్ ద్వారా మార్చి 8వ తేదీ 2025వ తేదీలోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. దరఖాస్తు రుసుము జనరల్ (ఓసీ, ఓబీసీ, మైనార్టీ) అభ్యర్థులకు రూ.1000, ఎస్సీ/ ఎస్టీ / ఎక్స్ సర్వీస్‌మెన్ / మహిళా/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.250 చొప్పున ఫీజు చెల్లించాలి.
ఎంపిక విధానం
జూనియర్ కోర్టు అసిస్టెంట్ పోస్టుకు ఎంపిక అవ్వాలంటే మూడు విధానాల్లో ఉంది. మొదట రాత పరీక్ష, రెండోది టైపింగ్ స్పీడ్ టెస్ట్, ఆఖరిది ఇంటర్వ్యూ. మూడింటిలో ప్రతిభ కలిగిన వారు తుది ఎంపికలో ఉంటారు.
జీతం
జూనియర్ కోర్టు అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపికైన వారికి ప్రారంభంలో నెలకు రూ.35,400 వరకు జీతం రూపంలో చెల్లిస్తారు. పదవీ విరమణ వరకు పదోన్నతులు ఉంటాయి. రిటైర్మ్‌మెంట్ వరకు నెలకు రూ.2 లక్షలు జీతం దాటే అవకాశం ఉంది.
పరీక్ష కేంద్రాలు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కలిపి 128 వరకు పరీక్ష కేంద్రాలు కేటాయిస్తారు.
పరీక్ష విధానం
రాత పరీక్ష: మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. 100 ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలకు 2 గంటల సమయంలో పరీక్ష రాయాల్సి ఉంటుంది.
జనరల్ ఇంగ్లిష్: 50 ప్రశ్నలు, జనరల్ ఆప్టిట్యూట్: 25 ప్రశ్నలు, జనరల్ నాలెడ్జ్: 25 ప్రశ్నలు ఉంటాయి.
టైపింగ్: టైపింగ్ స్కిల్ 10 నిమిషాలు ఉంటుంది. 3 శాతం తప్పులకు అవకాశం ఇస్తారు. ఆ తర్వాత ఇంగ్లిష్ భాషలో 2 గంటలపాటు డిస్క్రిప్టివ్ టైప్‌లో ఎస్సై రాత పరీక్ష ఉంటుంది.
ఇంటర్వ్యూ: న్యాయస్థానానికి సంబంధించిన అంశాలతోపాటు రాజ్యాంగం, సమకాలీన అంశాలు ఇంటర్వ్యూలో ఉండే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.