Parliament Budget Sessions: నేడు పార్లమెంట్ ముందుకు కీలక బిల్లు రాబోతోంది. ప్రస్తుతం ఉన్న పాత ఐటీ చట్టం స్థానంలో కొత్త బిల్లును తీసుకురానున్నారు. పన్ను చెల్లింపుదారులకు పాత దాని కంటే సులభంగా అర్థమయ్యేలా, సరళమైన భాషలో కొత్త ఆదాయపు పన్ను చట్టం ఉంటుందని ఆర్థిక మంత్రి నిర్మాల సీతారామన్ బడ్జెట్ సందర్భంగా స్పష్టం చేశారు. అన్ని అనుమతులకు ఆమోదం లభిస్తే కొత్త చట్టం ఏప్రిల్ 1, 2026 నుంచి అమలులోకి రానుంది.
ముఖ్యంగా బడ్జెట్ లో నిర్మలమ్మ ప్రవేశపెట్టిన బడ్జెట్ కారణంగా ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీకి చారిత్రక విజయానికి బాటలు వేసింది. అంతేకాదు 27 యేళ్ల ఢిల్లీ అసెంబ్లీ పీఠం దక్కడంలో ఇది కూడా ఒక అంశంగా పరిగణించవచ్చు. ఢిల్లీలో ఎంతో మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉంటడం మూలానా.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ బడ్జెట్ వల్ల మెజారిటీ ప్రజలు లబ్ది పొందడం కూడా ఓ కారణం కావచ్చు.
ఆ సంగతి పక్కన పెడితే.. ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. రెండో విడత బడ్జెట్ సెషన్ లో ఈ బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఈ బిల్లు విషయంలో ఇప్పటికే అఖిల పక్షానికి ఇంటిమేట్ కూడా చేసినట్టు సమాచారం. వక్ఫ్ బిల్లుతో పాటు మొత్తంగా 62 బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. అందులో 16 కీలక బిల్లులను ఈ సమావేశాల్లో ఆమోదించేలా కేంద్ర ప్రణాళికలు రచిస్తోంది.
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
వక్ఫ్ బిల్లుతో పాటు ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారెనర్స్ బిల్లును ప్రవేశపెట్టబోతున్నట్టు చెప్పారు. ఈ దేశంలో వలస వచ్చే వాళ్లు.. విదేశీయులకు సంబంధించిన అక్రమంగా వలన వచ్చిన రోహింగ్యాలు.. ఇప్పటికే మూడు స్థాయిల్లో వడపోత చేసింది.అక్రమ వలస దారులు.. NRC అమలు చేయడంతో పాటు జనగణన ప్రారంభించిడం. దేశానికి దశా, దిశను నిర్దేశించే బిల్లును ఈ సమావేశాల్లో రెండో విడత సమావేశాల్లో ప్రవేశ పెట్టనున్నారు. ముఖ్యంగా మన దేశంలో పౌరసత్వ నిర్ధారణకు విదేశీయుకు సంబంధించిన ఫారెనర్స్ యాక్ట్ 1946, పాస్ పోర్ట్ ఎంట్రీ ఇంటూ ఇండియా యాక్ట్ 1920, రిజిస్ట్రేషన్ యాక్ట్ 1939 స్థానంలో ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారెనర్స్ బిల్లును ఈ సమావేశాల్లో ప్రవేశ పెట్టనున్నట్టు తెలుస్తోంది.
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.