PM Kisan Amount: కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా 15వ విడత వాయిదా డబ్బుల్ని రైతుల ఖాతాల్లోకి బదిలీ చేసింది. దేశవ్యాప్తంగా లక్షలాది రైతుల ఖాతాల్లో ఒక్కొక్కరికి 2 వేల రూపాయలు జమ అయ్యాయి. ఎప్పటిలానే ఈసారి కూడా అనర్హుల్ని జాబితా నుంచి తొలగించడంతో చాలామందికి డబ్బులు జమ కాలేదు.
పీఎం కిసాన్ సమ్మాన్ యోజనలో భాగంగా ప్రధాని మోదీ 15వ విడత డబ్బుల్ని విడుదల చేశారు. ఈ పధకంలో భాగంగా 18 వేల కోట్లను రైతుల ఖాతాల్లోకి బదిలీ చేశారు. దేశవ్యాప్తంగా 8 కోట్ల మంది రైతులకు 15వ విడతలో భాగంగా 2 వేల రూపాయలు చెప్పున 18 వేల కోట్లను జార్ఘండ్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ విడుదల చేశారు. 14వ విడతలో 8 కోట్ల 5 లక్షలమంది రైతులకు 17 వేల కోట్లను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. అంతకుముందు 13వ విడతలో భాగంగా 16,800 కోట్లను విడుదల చేసింది.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన గురించి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఇప్పటికే సమాచారం అందించారు. నవంబర్ 15న రైతుల ఖాతాల్లో 15వ విడత డబ్బులు చేరుతాయని తెలిపారు. ఈసారి కూడా కేంద్ర ప్రభుత్వం అనర్హులైన రైతుల్నిం జాబితా నుంచి తొలగించడంతో కోట్లాది మంది రైతులకు 15వ విడత కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు అందలేదు. వివిద పోర్టల్స్‌లో అనుసంధానం కాని రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావని ప్రభుత్వం గతంలోనే స్పష్టం చేసింది. భూలేఖ్ ధృవీకరణ, ఆధార్ సీడింగ్ తప్పకుండా ఉండాలి.
ఆధార్ సీడింగ్ పూర్తయిన రైతులకే 15వ విడత కిసాన్ సమ్మాన్ నిధి పధకం డబ్బులు అందుతాయి. రైతుల్ని ఆర్ధికంగా ఆదుకునేందుకు అర్హులైనవారికి ఏడాదికి ప్రభుత్వం 6 వేల రూపాయలు చెల్లిస్తోంది. ఈ ఆరు వేల రూపాయలు మూడు వాయిదాల్లో వాయిదాల్లో ప్రతి నాలుగు నెలలకోసారి 2 వేల చొప్పున ఇస్తారు.
Also read: Subrata Roy Death: సహారా గ్రూప్ అధినేత సుబ్రతా రాయ్ మరణం, ప్రముఖుల సంతాపం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook