Sansad TV YouTube Channel Hacked: లోక్ సభ, రాజ్యసభ కార్యక్రమాలను ప్రసారం చేసే సంసద్ టీవీ యూట్యూబ్ ఛానెల్ హ్యాక్ (Sansad TV YouTube Channel Hacked) అయింది. హ్యాక్ చేసిన వారు ఛానెల్ పేరును "ఇథీరియమ్(క్రిప్టో కరెన్సీ)''గా మార్చినట్లు సంసద్ టెలివిజన్ ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో అలర్ట్ అయిన యూట్యూబ్ యాజమాన్యం సంసద్ టీవీ అకౌంట్‌ను నిలిపివేసింది. యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను (YouTube’s Community Guidelines) అతిక్రమించినందుకే అకౌంట్ బ్లాక్ చేసినట్లు తెలిపింది.
మంగళవారం (ఫిబ్రవరి 15) రాత్రి ఒంటి గంట నుంచి సంసద్ టీవీ యూట్యూబ్ ఛానెల్ సేవలు నిలిచిపోయాయి. సంసద్ టీవీ (Sansad TV) యెుక్క సోషల్ మీడియా టీమ్ సమస్యను పరిష్కరించి...తెల్లవారుజామున 3.45 నిమిషాలకు ఛానెల్ ను పునరుద్ధరించారు. అయితే యూట్యూబ్ కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు నిషేధం ఇంకా కొనసాగుతోంది. భద్రతా ముప్పును శాశ్వతంగా పరిష్కరించడంతోపాటు ఛానెల్ ను వీలైనంత త్వరగా రీస్టోర్ చేస్తామని యూట్యూబ్ వెల్లడించింది.
పార్లమెంట్ ఉభయ సభలైన లోక్ సభ, రాజ్యసభల యెుక్క రెండు టీవీ ఛానెళ్లను కలిపి ఏర్పాటు చేసిందే సంసద్ టీవీ. 2021 సెప్టెంబర్ 15న ప్రారంభమైంది. దీనికి సంబంధించిన పలు కార్యక్రమాలను ప్రసారం చేసేందుకు కేంద్రం యూట్యూబ్ ఛానెల్ ను తీసుకొచ్చింది.
Also Read: Hijab Controversy: హిజాబ్ వివాదంపై బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా సంచలన కామెంట్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook