చిన్నమ్మ ( Chinnamma ) జైలు నుంచి బయటకొచ్చేందుకు నిర్ణయించుకున్నారు. నిబంధనల ప్రకారం నిర్ణీత జరిమానా చెల్లించి 2021 ఫిబ్రవరిలో విడుదలయ్యేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. స్వయంగా శశికళే తన న్యాయవాదికి రాసిన లేఖతో స్పష్టమైంది.
అక్రమ ఆస్థుల కేసులో కర్నాటక జైళ్లో శిక్ష అనుభవిస్తున్న తమిళనాడు చిన్నమ్మ అలియాస్ శశికళ ( Sasikala ) విడుదలకు రంగం సిద్దమౌతోంది. కాదు కాదు..రంగం సిద్ధం చేసుకుంటోంది చిన్నమ్మ. నిబంధనల ప్రకారం నిర్ణీత మొత్తంలో జరిమానా చెల్లిస్తే ( Sasikala ready to pay the penalty ) శిక్షాకాలం కంటే ముందే అంటే 2021 ఫిబ్రవరి 21న విడుదలయ్యేందుకు అవకాశాలున్నాయని జైళ్ల శాఖ ( Jails Department ) నుంచి గతంలో ఓ ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. అప్పట్నించి ఆమె అభిమానులు ఆతృతతో ఎదురుచూస్తున్నారు. మరోవైపు తమిళనాట వచ్చే ఏడాది ఎన్నికలు కూడా ఉన్న తరుణంలో చిన్నమ్మ బయటకు వస్తే ఏం జరుగుతుంది..పరిస్థితి ఎలా ఉంటుందనేది చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే జయలలిత ( Jalalalitha ) నేతృత్వం వహించిన ఏఐఏడీఎంకే పార్టీ ( AIADMK ) ఇప్పుడు పూర్తిగా పళనిస్వామి ( Palani sami ) , పన్నీర్ సెల్వం ( Panneer selvam ) ల చేతిలో వెళ్లిపోయింది. జయలలిత తరువాత కాస్తా కూస్తో ప్రజాదరణ ఉన్నది శశికళకే.
అందుకే ఇప్పుడు అందరి దృష్టి శశికళపైనే ఉంది. ఈ నేపధ్యంలో 10 కోట్ల జరిమానా ( 10 crores penalty ) చెల్లించేందుకు సిద్ధంగా ఉండాలంటూ చిన్నమ్మ శశికళ తన న్యాయవాదికి రాసిన లేఖ ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. న్యాయవాది రాజాచెందూరు పాండియన్ కు ఆమె ఈ లేఖ రాశారు. గత కొద్దికాలంలో ఆమెను కలిసేందుకు సన్నిహితులు, న్యాయవాదులకు కర్ణాటక అనుమతి ఇవ్వకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
దేవుడి దయవల్ల తాను బాగానే ఉన్నానని చిన్నమ్మ తెలిపారు. తమిళనాడును కరోనా వణికిస్తోందని, దాని ప్రభావం పెరిగే అవకాశం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. త్వరలో రాష్ట్రం కరోనా నుంచి పూర్తిగా బయటపడాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు వివరించారు. మార్చి నుంచి తనతో ములాఖత్‌లను కర్ణాటక జైళ్ల శాఖ నిలుపుదల చేసిందని, ఎప్పుడు పునరుద్ధరిస్తుందో తెలియదన్నారు. 10 కోట్ల రూపాయల జరిమానా చెల్లింపునకు సిద్ధంగా ఉండాలని, అదేవిధంగా కోర్టు వ్యవహారాలు,న్యాయపరమైన అంశాల్ని ఎదుర్కొనేందుకు ఢిల్లీలోని సీనియర్ న్యాయవాదుల్ని సంప్రదించాలని లేఖలో కోరారు. Also read: Haj 2021: ఆ తర్వాతే హజ్ యాత్రపై నిర్ణయం: కేంద్ర మంత్రి నఖ్వీ