Goa Tragedy: కరోనా విపత్కర పరిస్థితులు కొనసాగుతున్నాయి. గోవాలో జరిగిన దారుణం అందర్నీ కలచివేస్తోంది. గంటల వ్యవధిలో పెద్దఎత్తున కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. కారణమేంటనేది స్పష్టత రావల్సి ఉంది.
దేశంలో కరోనా(Corona virus) పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. గోవాలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో విషాదం (Goa Tragedy) చోటు చేసుకుంది.కేవలం 4 గంటల వ్యవధిలో ఏకంగా 26 మంది కరోనా రోగులు ప్రాణాలు( 26 Covid patients died) కోల్పోయారు.రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విశ్వజీత్ రాణే ఈ విషయాన్ని ధృవీకరించారు. అయితే రోగుల మరణానికి కారణాలు ఇంకా తెలియలేదు. మెడికల్ ఆక్సిజన్ లభ్యత( Oxygen Availability), జీఎంసీహెచ్లోని కోవిడ్ 19 వార్డులకు ఆక్సిజన్ సరఫరాలో సమస్యల వల్ల రోగులకు ఇబ్బంది కలిగి ఉండవచ్చని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ (Goa CM Pramod Sawant) తెలిపారు. అయితే రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత (Oxygen shortage) మాత్రం లేదన్నారు. ఒక్కోసారి సిలెండర్లు సమయానికి చేరుకోకపోతే సమస్యలు వస్తాయని చెప్పారు. నిన్న ఆసుపత్రికి 12 వందల సిలెండర్లు అవసరం కాగా 4 వందలే సరఫరా అయ్యాయన్నారు.
ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాల్సిన అవసరముందని గోవా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మెడికల్ ఆక్సిజన్ సరఫరాలో కొరత ఉంటే..ఎలా ఆ సమస్యను దూరం చేయాలనేది ఆలోచించాలన్నారు. గోవాలో ఇప్పటివరకూ 1 లక్ష 21 వేల 650 మందికి కరోనా సోకగా..1729 మంది ప్రాణాలు కోల్పోయారు.
Also read: Vaccine Patent: వ్యాక్సిన్ అందరికీ అందాలంటే..ఫార్ములా షేర్ చేయాల్సిందే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook