Speaking on Phone While Driving: డ్రైవింగ్ చేస్తూ ఫోన్లో మాట్లాడటం చట్టరీత్యా నేరమనే సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేరానికి పాల్పడితే కోర్టు మెట్లు ఎక్కక తప్పదు. జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది. అయితే ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడాన్ని భవిష్యత్తులో చట్టబద్దం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుండటం గమనార్హం. అయితే దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి. దీనికి సంబంధించి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లోక్‌సభలో కీలక ప్రకటన చేశారు.
'వెహికల్ డ్రైవర్ హ్యాండ్ ఫ్రీ డివైజ్ వాడుతూ ఫోన్లో మాట్లాడుతున్నట్లయితే.. అది శిక్షార్హమైన నేరంగా పరిగణించబడదు. కాబట్టి ట్రాఫిక్ పోలీస్ జరిమానా విధించడం కుదరదు. ఒకవేళ జరిమానా విధిస్తే.. సదరు వెహికల్ డ్రైవర్ దాన్ని కోర్టులో సవాల్ చేయవచ్చు.' అని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. అంటే.. డ్రైవర్ ఫోన్ మాట్లాడే సమయంలో హ్యాండ్ సెట్ అతని చేతిలో ఉండకూడదు. హ్యాండ్ సెట్‌ను పాకెట్లో పెట్టుకుని హ్యాండ్ ఫ్రీ డివైజ్ ద్వారా అతను ఫోన్ కాల్ మాట్లాడుకోవచ్చు.
ఈ నిర్ణయం వెహికల్ డ్రైవర్లకు కాస్త రిలాక్సేషన్‌గా ఉంటుందని కేంద్రం భావిస్తోంది. అయితే ఇది ఎప్పటినుంచి అమలులోకి వస్తుందనే దానిపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ స్పష్టత ఇవ్వలేదు. త్వరలోనే ఈ మేరకు ట్రాఫిక్ రూల్స్‌ను సవరించే అవకాశం ఉంది. కాగా, డ్రైవింగ్‌లో రూట్ నేవిగేషన్ కోసం డ్రైవర్లు ఫోన్‌ను ఉపయోగించవచ్చునని గతేడాది సెప్టెంబర్‌లో నితిన్ గడ్కరీ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. డ్రైవింగ్‌పై కాన్సంట్రేషన్ దెబ్బతినకుండా రూట్ నేవిగేషన్ కోసం ఫోన్ వాడవచ్చునని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read: Prema Entha Madhuram: వాలెంటైన్స్ డే స్పెషల్.. రియల్ కపుల్స్‌తో ప్రేమ ఎంత మధురం టైటిల్ సాంగ్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook