Manipur video: స్పందికపోతే మేం చర్యలు తీసుకుంటాం.. మణిపూర్ ఘటనపై సుప్రీం కోర్టు సీరియస్

Supreme Court On Serious on Manipur Video: మణిపూర్ ఘటనపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యులైన వారిపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే.. తామే విచారణ చేపడతామని స్పష్టం చేసింది. అక్కడ మహిళల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో కోర్టు తెలపాలని ఆదేశించింది.  

Written by - Ashok Krindinti | Last Updated : Jul 20, 2023, 02:21 PM IST
Manipur video: స్పందికపోతే మేం చర్యలు తీసుకుంటాం.. మణిపూర్ ఘటనపై సుప్రీం కోర్టు సీరియస్

Supreme Court On Serious on Manipur Video: మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. అన్ని వైపులా నుంచి ఆగ్రహ జ్వాలలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనపై సుప్రీం కోర్టు కూడా సీరియస్ అయింది. మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో ఆందోళనకు గురిచేసిందని సుప్రీం కోర్టు పేర్కొంది. ఈ అంశంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ కోరారు. కేంద్ర తగిన చర్యలు తీసుకోకపోతే.. జూలై 28న న్యాయస్థానం కేసు విచారణ చేపడుతుందన్నారు. అదేవిధంగా ఆ ప్రాంతంలో మహిళల భద్రత కోసం తీసుకుంటున్న చర్యల గురించి కోర్టుకు తెలియజేయాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలను అస్సలు అంగీకరించలేమని.. ఇది రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడమేనని వ్యాఖ్యానించారు.

"మణిపూర్ వీడియోలు చూసి చూసి దిగ్భ్రాంతికి గురయ్యాం.. హింసాత్మక ప్రాంతంలో మహిళలను వస్తువులుగా వాడుకున్నారు. దీనికి బాధ్యులైన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలి. మేము తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తున్నాం. ఇది ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన సమయం. ఇది ఆమోదయోగ్యం కాదు. ప్రభుత్వం చర్య తీసుకోకపోతే.. మేము విచారణ చేపడతాం. హింసకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను కోర్టుకు తెలియజేయాలి.." అని చీఫ్‌ జస్టిస్ చంద్రచూడ్ అన్నారు.

మణిపూర్‌ ఘటనపై ప్రధాని మోదీ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటన ఏ నాగరిక సమాజానికైనా సిగ్గుచేటని అని అన్నారు. ఇద్దరు మహిళలపై అమానవీయ ప్రవర్తన తన హృదయాన్ని తీవ్రంగా కలచివేసిందని విచారం వ్యక్తం చేశారు. 140 కోట్ల మంది భారతీయులను సిగ్గుపడేలా చేసిందని అన్నారు. ఈ కేసులో దోషులను విడిచిపెట్టబోమని.. రాజకీయాలకు అతీతంగా స్పందించాలని కోరారు. ముఖ్యమంత్రులందరూ తమ తమ రాష్ట్రాల్లో శాంతిభద్రతలను పటిష్టం చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా మహిళల భద్రత కోసం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

మణిపూర్‌ రాష్ట్రం గత రెండు నెలలుగా అల్లర్లతో అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 100 మంది పైగా ప్రాణాలు కోల్పోగా.. అనేక మంది గాయాలపాలయ్యారు. ఇంఫాల్‌కు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాంగ్‌పోక్పి జిల్లాలోని బి ఫైనోమ్ గ్రామంలో ఇద్దరు మహిళను నగ్నంగా ఊరేగించిన ఘటన యావత్ దేశాన్ని కదిలిస్తోంది. మే 4న ఈ సంఘటన చోటు చేసుకోగా.. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనలో ప్రధాని నిందితుడు హెరాదాస్ (32) అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. తౌబాల్ జిల్లాకు చెందిన అతడిని.. ఆకుపచ్చ టీ-షర్ట్ ధరించినట్లు వీడియో సహాయంతో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

Also Read: Weather Updates Today: ఈ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్.. భారీ వర్షాలు కురిసే ప్రాంతాలు ఇవే..!

Also Read: Manipur Violence: మణిపూర్‌లో భయంకరమైన వీడియో.. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి.. దారుణం..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

Trending News