manipur violence: మణిపూర్లో ఇద్దరు మహిళల నగ్న ఊరేగింపు వీడియో ఘటనను సుమోటోగా స్వీకరించిన సుప్రీం కోర్టు.. ఇవాళ విచారణ జరపనుంది. ఈ తరుణంలో ఒక్కరోజు ముందు అంటే.. గురువారం మణిపూర్ హింసపై సుప్రీం కోర్టులో కేంద్ర ప్రభుత్వం ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. కేసును సీబీఐకి బదిలీ చేసినట్లు సర్వోన్నత న్యాయస్థానానికి కేంద్ర హోం శాఖ వెల్లడించింది.
Supreme Court On Serious on Manipur Video: మణిపూర్ ఘటనపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యులైన వారిపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే.. తామే విచారణ చేపడతామని స్పష్టం చేసింది. అక్కడ మహిళల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో కోర్టు తెలపాలని ఆదేశించింది.
Manipur Violence Video: మణిపూర్ అల్లర్లకు సంబంధించి ఓ భయంకరమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఓ వర్గం.. వారి పట్ల దారుణంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనను రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఖండించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.