Uttarakhand snowfall : ఉత్తరాఖండ్‌లో హిమపాతం చూశారా..?

ఉత్తరాఖండ్‌లో ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయికి పడిపోయాయి. పర్వత ప్రాంతాల్లో తీవ్రంగా మంచు కురుస్తోంది. దీంతో పర్వత ప్రాంతాల్లో ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంచు కారణంగా రోడ్లన్నీ మూసివేశారు.

Last Updated : Jan 3, 2020, 11:16 AM IST
Uttarakhand snowfall : ఉత్తరాఖండ్‌లో హిమపాతం చూశారా..?

ఉత్తరాఖండ్‌లో ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయికి పడిపోయాయి. పర్వత ప్రాంతాల్లో తీవ్రంగా మంచు కురుస్తోంది. దీంతో పర్వత ప్రాంతాల్లో ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మంచు కారణంగా రోడ్లన్నీ మూసివేశారు. మరోవైపు తీవ్రంగా కురుస్తున్న మంచు పర్యాటకులకు ఆహ్లాదం పంచుతోంది. తాజాగా కురిసిన హిమపాతం కారణంగా.. ఆ ప్రాంతమంతా తెల్లటి దుప్పటి పరుచుకున్నట్లుగా ఉంది. ఇళ్లు, చెట్లు, కార్లు అన్నీ మంచు ముద్దల్లో మునిగిపోయి కనిపిస్తున్నాయి. చివరకు కరెంటు తీగలపై కూడా మంచు అలా పేరుకుపోయి కనిపిస్తోంది. చూడ్డానికి ఆహ్లదకరంగా ఉందని పర్యాటకులు చెబుతున్నారు.

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News