Vande Bharat New Colour: సెమీ హై స్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రంగు త్వరలో మార్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం తెలుపు, నీలం రంగులో రైళ్లు ఉండగా.. నారింజ-బూడిద రంగులోకి మార్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ వందే భారత్ రైళ్ల తయారీ జరుగుతున్న చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)ను సందర్శించనున్నారు. అనంతరం కొత్త రంగుకు ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. ప్రస్తుతం కొత్త కలర్‌తో కూడిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
ప్రస్తుతం ఉన్న తెలుపు రంగుపై దుమ్ము పడితే త్వరగా పాతదిగా కనిపిస్తున్నాయి. వైట్ కలర్ కావడంతో శుభ్రం చేయడం కూడా కాస్త కష్టం మారుతోంది. ఈ క్రమంలోనే వందేభారత్ రైళ్లకు రంగు మార్చాలని నిర్ణయించినట్లు తెలిసింది. కొన్ని కలర్ కాంబినేషన్లు పరిశీలించి.. ఆరెంజ్-గ్రే కాంబినేషన్‌కు ఒకే చేసినట్లు సమాచారం. కోచ్‌లకు రెండు వైపులా ఆరెంజ్ కలర్ వేసి.. డోర్‌లకు బూడిద రంగు ఉంటుందని అంటున్నారు. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దేశవ్యాప్తంగా 26 వందే భారత్ రైళ్లు నడుస్తుండగా.. రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపిన తర్వాత వీటికి కొత్త రంగులోకి మార్చే ఛాన్స్ ఉంది.
అదేవిధంగా పలు రూట్లలో వందేభారత్ ఛార్జీలను తగ్గించేందుకు రైల్వే శాఖ రెడీ అవుతోంది. తక్కువ దూరం ప్రయాణించే తక్కువ ఆక్యూపెన్సీ ఉంటున్న నేపథ్యంలో ఛార్జీలను సమీక్షిస్తోంది. ఛార్జీలను ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చి.. సీట్లను భర్తీ చేయాలని భావిస్తోంది. ఇండోర్-భోపాల్, భోపాల్-జబల్‌పూర్, నాగ్‌పూర్-బిలాస్‌పూర్ మార్గాల మధ్య నడుస్తున్న వందే భారత్ రైళ్ల ఛార్జీలపై రైల్వే అధికారులు సమీక్ష నిర్వహిస్తున్నారు. గత నెల జూన్ వరకు భోపాల్-ఇండోర్ మధ్య 29 శాతం సీట్లు, ఇండోర్-భోపాల్ రైలులో కేవలం 21 శాతం సీట్లు మాత్రమే నిండాయి. 70 శాతం రైలు ఖాళీగా ఉంటున్న తరుణంలో ఛార్జీలు తగ్గించాలని రైల్వే అధికారులు భావిస్తున్నారు.
Also Read: Happy Birthday Sourav Ganguly: సౌరవ్ గంగూలీ బర్త్ డే స్పెషల్.. దాదా కెరీర్‌లో మర్చిపోలేని వివాదాలు
Also Read: HDFC Bank Interest Rates: కస్టమర్లకు షాకిచ్చిన హెచ్‌డీఎఫ్‌సీ.. వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం..! ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి