Free Lemon and Free Petrol: ఓవైపు పెట్రోల్, డీజిల్ ధరలు... మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలు... ఇలా అన్నింటి ధరలు పెరుగుతున్నాయి. ధరల పెరుగుదలతో సామాన్యులు కుదేలవుతున్నారు. ఇటీవలి కాలంలో నిమ్మకాయ ధరలు కూడా భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. కాస్త పెద్ద సైజు నిమ్మకాయ ఒక్కింటికి రూ.10 వరకు ధర ఉంది. మీడియం సైజు నిమ్మకాయలు రూ.10కి రెండు మాత్రమే ఇస్తున్నారు. ఇలా నిమ్మకాయ ధరలు పైపైకి ఎగబాకుతున్న వేళ వారణాసికి చెందిన 'మొబీ వరల్డ్' యజమాని ఒకరు బంపరాఫర్ ప్రకటించారు.
తమ స్టోర్‌లో మొబైల్ ఫోన్ యాక్సెసరీస్ కొనుగోలు చేసేవారికి ఉచితంగా 2-4 నిమ్మకాయలు ఇస్తామని ప్రకటించారు. అంతేకాదు, రూ.10 వేలు వరకు షాపింగ్‌పై పెట్రోల్ ఉచితంగా ఇస్తామన్నారు. అయితే పెట్రోల్ ఎన్ని లీటర్లు ఉచితంగా ఇస్తారనేది చెప్పలేదు. ప్రస్తుతం మొబీ వరల్డ్ షాపుకి వెళ్తే... అక్కడ నిమ్మకాయలు పేపర్ ప్లేట్‌లో పెట్టి కనిపిస్తున్నాయి. యాక్సెసరీస్ కొనుగోలు చేసినవారికి... వాటితో పాటు నిమ్మకాయలు ప్యాక్ చేసి ఇస్తున్నారు.
ప్రస్తుతం ఢిల్లీలో కిలో నిమ్మకాయల ధర రూ.350 వరకు ఉంది. పెట్రోల్ ధర రూ.105కి పైనే ఉంది. నిమ్మకాయలు, పెట్రోల్ ఒకేసారి ధరలు పెరుగుతుండటంతో మొబీ వరల్డ్ యజమాని కస్టమర్లను ఆకర్షించేందుకు ఫ్రీ లెమన్, ఫ్రీ పెట్రోల్ ఆఫర్ ప్రకటించాడు. సేల్స్ పెంచుకునేందుకు ఇలా ధరల పెరుగుదలను కూడా ఉపయోగించుకుంటున్నాడన్న మాట..!
Also Read: MLA slaps Youth: రోడ్లు, తాగునీరు అడిగినందుకు.. యువకుడి చెంప పగలగొట్టిన ఎమ్మెల్యే
Also Red: CHSL Notification 2022: ఇంటర్ అర్హతతో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం.. నోటిఫికేషన్ విడుదల!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.