Cloves For Health Problems: మన ప్రతిరోజు ఉపయోగించే మసాల దినుసులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అందులో ఎక్కువగా బిర్యానీలో ఉపయోగించే లవంగాలు రుచికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా సహాయపడుతాయి. దీని వల్ల తరుచు ఇబ్బంది పట్టే గ్యాస్, గొంతు నొప్పి, డయాబెటిస్ వంటి సమస్యలకు ఇది ఒక వరం. ఇది ఎలా సహాయపడుతుంది..? లవంగాలు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం.
లవంగాల ఆరోగ్యలాభాలు:
లవంగాలు అనేవి వంటల్లో మాత్రమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న మసాలా దినుసులు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లాంటి గుణాలు పుష్కలంగా ఉంటాయి.
లవంగాలు తినడం వల్ల ఉపయోగాలు:
మనలో చాలా మంది కొంచెం ఆహారం తిన్నకూడా గ్యాస్ సమస్యలు కలుగుతాయి. గ్యాస్ సమస్య నుంచి బయటపడడానికి కొందరు మందులు ఉపయోగిస్తుంటారు. కానీ వీటి వల్ల కూడా అనారోగ్య సమస్యలు కలుగుతాయి. కానీ ఎలాంటి మందులు ఉపయోగించకుండా కేవలం లవంగాలను వాడి గ్యాస్ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ప్రతిరోజు పరగడుపున ఒక గ్లాస్ నీటిలో లవంగాల నూనెను కలుపుకొని తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు కూడా తొలుగుతాయి.
చిన్న పిల్లలు, పెద్దలు తరుచుగా జలుబు సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే ఒక లవంగం ముక్కను నోట్లో పెట్టుకోవాలి. ఇందులో ఉండే ఆరోగ్య గుణాలు జలుబును తొలగించడంలో సహాయపడుతాయి. అంతేకాకుండా జలుబు వల్ల కలిగే గొంతు నొప్పి సమస్యలు కూడా తగ్గుతాయి. ఇలా వారంలో రెండు సార్లు చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారు ఎక్కువగా మార్కెట్‌లో లభించే ప్రొడెక్ట్స్‌లను ఉపయోగిస్తారు. కానీ ఇవి ఆరోగ్యానికి మంచిది కాదు. నోటి దుర్వాసనకు ఇంట్లోనే చక్కటి చిట్కాలు ఉంటాయి. అందులో లవంగం ఒకటి. దీని తినడం వల్ల వెంటనే దుర్వాసనను తగ్గిస్తుంది. 40 రోజుల పాటు ప్రతిరోజూ ఉదయం నోటిలో ఉంచండి నమలడం వల్ల మార్పులు తెలుస్తుంది.
అధిక బరువు తో ఇబ్బంది పడేవారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. బరువు తగ్గడానికి చాలా మంది వాయ్యామం, మందలు, జిమ్ వంటి పనులు చేస్తుంటారు కానీ ఎలాంటి ఫలితం ఉండదు. బరువు తగ్గడానికి లవంగం కీలక ప్రాత పోషిస్తుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుతుంది. ఆకలిని అదుపులో ఉంచుతుంది. దీని వల్ల సులువుగా బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా లవంగం కేలరీలను వేగంగా బర్న్ చేయడం లో సహాయపడుతుంది.
షుగర్ సమస్యలతో బాధపడేవారికి కూడా లవంగం ఎంతో సహాయపడుతుంది. ఇది షుగర్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. రాత్రిపూట లవంగంను తినడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఇందులో ఉండే నైజరిన్ ఇన్సులిన్ స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది. అయితే లవంగం ఉపయోగించే ముందు వైద్యుడి సలహా తీసుకోవడం చాలా మంచిది.
Also read: Lungs Problems: ఊపిరితిత్తులు ముసలివైపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.