Constipation Remedies: చిటికెలో మలబద్ధకం సమస్యకు చెక్‌.. ఎలాగో తెలుసా..?

Constipation Remedies: మలబద్ధకం సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఈ కింద పేర్కొన్న చిట్కాను వినియోగించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వీటిని తీసుకుంటే మలబద్ధకమే కాకుండా మధుమేహం, కొలెస్ట్రాల్‌ సమస్యలు కూడా తగ్గుతాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 10, 2022, 12:57 PM IST
Constipation Remedies: చిటికెలో మలబద్ధకం సమస్యకు చెక్‌.. ఎలాగో తెలుసా..?

Constipation Remedies: ప్రస్తుతం బిజీ లైఫ్ కారణంగా చాలా మంది తమ శరీరంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోలేకపోతున్నారు. దీంతో వారు తీవ్ర అనారోగ్య సమస్యల బారినపడుతున్నారు. ముఖ్యంగా చాలా ఈ పరిస్థితుల్లో టైమ్‌ దోరకక బయట లభించే వివిధ రకాల అనారోగ్యకరమైన ఆహారాలు తింటున్నారు. దీంతో వారు పొట్ట సమస్యలకు గురవుతున్నారు. ఈ క్రమంలో చాలా మంది మలబద్ధకం, పొట్టలో గ్యాస్‌ వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి పిండి పదార్థాలు, పీచు, కొవ్వు, అమైనో ఆమ్లాలు, మెగ్నీషియం, ప్రొటీన్లు వంటి ఆహారాలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. సులభంగా పొట్ట సమస్యల నుంచి విముక్తి పొందడానికి అవిసె గింజలను ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం..

మలబద్ధకం సమస్యలకు చెక్‌..
అవిసె గింజల్లో శరీరానికి కావాల్సిన కరిగే ఫైబర్ లభిస్తుంది. ఇది జీర్ణ క్రియ సమస్యలను తగ్గించి బరువును సులభంగా నియంత్రిస్తుంది. అంతేకాకుండా ప్రతి రోజు ఈ గింజలను వినియోగిస్తే మలబద్ధకం సమస్య కూడా తగ్గుతుంది. అయితే అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఈ విత్తనాలను సలాడ్, వెజిటబుల్, ఫ్రూట్ చాట్, లస్సీ లేదా స్మూతీలో వినియోగించండి.

మధుమేహం, కొలెస్ట్రాల్‌ సమస్యలకు చెక్‌:
మధుమేహం, కొలెస్ట్రాల్‌ సమస్యలతో బాధపడుతున్నవారికి అవిసె గింజలు ప్రభావవంతంగా పని చేస్తాయి. వీటిని తరచుగా వినియోగిస్తే రక్తంలో చక్కెర పరిమాణాలు తగ్గించి.. మధుమేహాన్ని నియంత్రిస్తుంది. ఇందులో ఉండే గుణాలు చెడు కొలెస్ట్రాల్‌ను కూడా కరిగిస్తాయి.

బరువు తగ్గడం:
చాలా మంది బరువు తగ్గడానికి వివిధ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఎలాంటి కఠినతర వ్యాయామాలు చేయకుండా అవిసె గింజలను వినియోగించి బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.  ఉదయం, సాయంత్రం వీటిని స్నాక్‌లో వినియోగించవచ్చు.

NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దయచేసి దీనిని స్వీకరించే ముందు వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.

 

Also Read: Allu Aravind Fourth Son: అల్లు అరవింద్ కు నలుగురు కుమారులు.. నాలుగో కుమారుడు ఎవరో తెలుసా?

Also Read: Janhvi Kapoor Latest Photos: సౌదీ అరేబియాలో అరేబియన్ హార్స్ లా జాన్వీ కపూర్ ఫోజులు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News