Radish Juice Health Benefits: కూరగాయల్లో ఎన్నో పోషకాలు కలిగి ఉంటాయి. మన ఆకలి తీర్చడమే కాకుండా శరీరంలో అనేక ప్రయోజనాలను కూరగాయలు కలిగిస్తాయి. ఆకలి తీరుస్తూనే మన ఆరోగ్యం మెరుగుదలకు కూరగాయలు దోహదం చేస్తాయి. వాటిలో ముల్లంగి అత్యధికంగా మేలు చేస్తుంది. తెల్లగా ఉండే ముల్లంగి చూడడానికి బాగానే ఉన్నా దాని వాసన కొంత తినడానికి విరక్తి కలిగిస్తుంది. ముల్లంగిని రుచికరంగా సాంబారులో.. చట్నీరూపంలో.. లేదా ముల్లంగిని మరికొన్ని వంటకాలుగా చేసుకోవచ్చు. ముల్లంగిని తినడం వలన కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.
Also Read: Rose Water: రోజ్ వాటర్ ఇలా వాడితే ముఖం కాంతివంతం.. జుట్టుకు రెండురెట్ల బలం..
- ముల్లంగిని గ్రైండ్ చేసి ఫిల్టర్ చేసుకోవాలి. కొంత సమయం తర్వాత తాగాలి. ముల్లంగి రసం తరచుగా తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది శరీరానికి ఒక దివ్యౌషధంగా పని చేస్తుంది.
- ముల్లంగి రసాన్ని తాగడం ద్వారా కడుపు శుభ్రం అవుతుంది. వారంలో ఒకటి లేదా రెండుసార్లు ముల్లంగిని జ్యూస్‌లాగా తీసుకోవచ్చు. ముల్లంగిని రసం తాగడంతో రక్తంలోని వ్యర్థాలు తొలగిపోతాయి. అంతేకాకుండా ఎముకలు దృఢంగా ఉంటాయి. రాత్రి భోజనంలో ముల్లంగి ఉంటే ఆహారం త్వరాగ జీర్ణమవుతుంది.
- ముల్లంగిలో ఉండే ఫైబర్ పదార్థం జీర్ణక్రియకు సహాయ పడుతుంది. మలబద్ధకం సమస్య నివారిస్తుంది. పేగు కదలికలను మెరుగుపరచడం ద్వారా విసర్జనకు సమస్యలు తొలగుతాయి.
- ముల్లంగిలో ఖనిజ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముల్లంగిలో ఉన్న విటమిన్ సీ, పొటాషియం, ఫోలేట్ వంటి పోషకాలు శరీరానికి కావలసిన శక్తిని అందిస్తాయి. విటమిన్ సీ రోగనిరోధక శక్తిని పెంచడానికి దోహదం చేస్తుంది. పొటాషియం రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది. ఫోలేట్ కణాల అభివృద్ధికి దోహదం చేస్తుంది.
Also Read: Kiwi Juice Benefits: కివి జ్యూస్ ఇప్పుడు ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి
కొవ్వు కరిగించే గుణం
ముల్లంగి జ్యూస్ తాగితే కొవ్వును కరిగిస్తుంది. ఉదరం ప్రాంతంలో పేరుకుపోయిన కొవ్వును కొండలా కరిగించే శక్తి ముల్లంగికి ఉంది. బరువు తగ్గాలనుకునే వారు క్రమంగా ముల్లంగిని ఆహారంలో భాగం చేసుకోవాలి. ముల్లంగి రసం కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.
గమనిక
ముల్లంగి రసం ఆరోగ్యానికి చాలా మంచిదే. కానీ మేము అందిస్తున్న సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. కొంతమందికి ముల్లంగి రసం విరక్తి ఉంటుంది.. పడకపోవచ్చు. మీరు వైద్య సలహా తీసుకుని పాటించాల్సి ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి