Black Raisins Water Benefits: ఆధునిక జీవనశైలి కారణంగా వస్తున్న తీవ్ర అనారోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని చాలా మంది ఉదయాన్నే అల్పాహారికి ముందుగా డ్రై ఫ్రూట్స్‌ను తీసుకుంటున్నారు. ప్రస్తుతం చాలా మంది బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్షలను ఎక్కువగా తీసుకుంటున్నారు. వీటితో పాటు నల్ల ఎండు ద్రక్షలను ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో శరీరానికి కావాల్సిన ప్రోటీన్, ఫైబర్, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ సి అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటిని నీటిలో రాత్రంత నానబెట్టి ఉదయాన్నే తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. దీంతో పాటు తీవ్ర వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఉదయాన్నే ఈ నల్ల ఎండు ద్రాక్షను తినడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఎండుద్రాక్ష నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:
జుట్టును దృఢంగా చేస్తుంది:
ఉదయాన్నే రాత్రి నానబెట్టిన ఎండుద్రాక్ష నీరును తాగడం వల్ల జుట్టు దృఢంగా తయారవుతుంది. అంతేకాకుండా జుట్టు రాలడం కూడా సులభంగా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తరచుగా జుట్టు రాలడం సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఇలా తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఇతర అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలుగుతుంది.
రక్తహీనత సమస్యకు చెక్:
నల్ల ఎండు ద్రాక్షలో ఐరన్ పరిమాణాలు అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు అల్పాహారంలో భాగంగా ఈ ద్రాక్షను తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా రక్తంలోని పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలు కూడా సులభంగా బయటకు వస్తాయి.
ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి
రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
ప్రస్తుతం చాలా మంది రోగనిరోధక శక్తి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు నల్ల ఎండు ద్రక్షలను ప్రతి రోజు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. నల్ల ద్రాక్షలో విటమిన్ సి, ప్రోటీన్స్ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీర ఆరోగ్యంగా ఉంటుంది.
చర్మ సమస్య నుంచి కూడా ఉపశమనం:
చర్మ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఖాళీ కడుపుతో నల్ల ద్రాక్షలను తీసుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఎండుద్రాక్షలో యాంటీఆక్సిడెంట్స్ లక్షణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటిని ప్రతి రోజు ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల అన్ని రకాల చర్మ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి