Face Scrub For Glowing Skin At Home: సీజన్‌ను బట్టి శరీరం, చర్మంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం భారతదేశ వ్యాప్తగా వానాలు భారీగా కురుస్తున్నాయి. దీని కారణంగా వాతావరణంలో తేమ శాతం కూడా పెరుగుతుంది. దీంతో చాలా మందిలో చర్మ సమస్యలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ముఖంపై మెరుపు తగ్గి, అనేకర రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి క్రమంలో చర్మంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే చర్మ సమస్యలతో బాధపడుతుంటే సాధరణ వస్తువులతో తయారు చేసిన ఫేస్ స్క్రబ్‌లు వినియోగించాల్సి ఉంటుంది. దీనిని వినియోగించడం వల్ల చర్మం మొరిసేల కాంతి వంతంగా తయారవుతుంది.
50 ఏళ్ల వయస్సులో ఉన్నవారిలో తరచుగా చర్మ సమస్యలు వస్తూ ఉంటాయి. అంతేకాకుండా చాలా మంది ప్రస్తుతం చిన్న వయసులో ఉన్న ఎన్నో సంవత్సరాలు కలిగిన వ్యక్తుల్లా కనిపిస్తున్నారు. దీని ప్రధాన కారణాలు చర్మ సమస్యలేనని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ రోజు మేము సూచించే ఫేస్ స్క్రబ్‌లు వినియోగించడం వల్ల ఎక్స్‌ఫోలియేషన్ ప్రక్రియ మీ చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది. అంతేకాకుండా తీవ్ర చర్మ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. అయితే ఈ ఫేస్ స్క్రబ్‌లను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Also Read: Credit Card Rules: ఈ బ్యాంక్ క్రెడిట్ కార్డు యూజర్లకు షాక్.. పెరిగిన ఛార్జీలు ఇలా..!
మెరిసే చర్మం కోసం ఫేస్ స్క్రబ్‌లు:
అరటిపండు, ఓట్స్ ఫేస్ స్క్రబ్:
అరటిపండును అందరూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే దీనిని తినడానికే కాకుండా ఫేస్ స్క్రబ్‌గా కూడా వినియోగించవచ్చు. ఇందులో అధిక పరిమాణంలో విటమిన్ సి, విటమిన్ ఇ లభిస్తాయి. అరటిని మిశ్రమంలా తయారు చేసి ముఖానికి పట్టిస్తే చర్మం మెరిసేలా తయారవుతుంది. అయితే ఇదే అరటి మిశ్రమంలో రెండు చెంచాల ఓట్స్ పిండిని కలిపి మిశ్రమంలా తయారు చేసి.. ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా మొటిమలు, మచ్చల సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
ఓట్స్, తేనె ఫేస్ స్క్రబ్:
ఈ ఫేస్ స్క్రబ్‌ను తయారు చేయడానికి ముందుగా ఒక కప్పు ఓట్స్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో నాలుగు చెంచాల తేనెను కలిపి మిశ్రమంలా తయారు చేయాలి. ఇలా తయారు చేసిన ముఖానికి అప్లై చేయాలి. తేనెలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ఈ ఫేస్ స్క్రబ్‌ను ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా మొటిమలు, మచ్చల సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలుగుతుంది.
Also Read: Credit Card Rules: ఈ బ్యాంక్ క్రెడిట్ కార్డు యూజర్లకు షాక్.. పెరిగిన ఛార్జీలు ఇలా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి