Stop Hair Fall Immediately At Home For Male: జుట్టు సమస్యలతో బాధపడే వారి సంఖ్య రోజుకు పెరిగిపోతోంది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరిలోనూ జుట్టు రాలిపోతోంది. అయితే చాలామంది ఇలాంటి సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు.. అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం, వాతావరణంలోని కాలుష్యమేని వైద్యులు చెబుతున్నారు. కొంతమందిలో జుట్టు రాలుతూ బట్టతల సమస్యలు కూడా వస్తున్నాయి. అయితే జుట్టు రాలడం ప్రారంభంలోనే నియంత్రించుకోవడం చాలా మంచిది లేకపోతే బట్టతల వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం హెయిర్ ఫాల్ సమస్యలతో బాధపడుతున్న వారు మార్కెట్లో లభించే రసాయనాలతో కూడిన హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ ను అతిగా వినియోగిస్తున్నారు వీటిని వినియోగించడం వల్ల జుట్టు మరింత రాలడం పెరుగుతోంది. అంతేకాకుండా వీటివల్ల కొంతమందిలో ఇతర దీర్ఘకాలిక వ్యాధులు కూడా వస్తున్నాయి. కాబట్టి వీటికి బదులుగా న్యాచురల్ గా లభించే షాంపూలను వినియోగించడం చాలా మంచిది. అంతేకాకుండా కొంతమంది ఆయుర్వేద నిపుణులు సూచించిన చిట్కాలను పాటిస్తే జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు. అయితే ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్న మొదటి చిట్కా ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆయుర్వేదంలోని కొన్ని రెమెడీలు జుట్టు రాలడాన్ని సులభంగా తగ్గిస్తాయి అంతేకాకుండా జుట్టును అందంగా తయారు చేస్తాయి అందులో ముఖ్యంగా నానబెట్టిన బియ్యంతో తయారు చేసిన ఓ మిశ్రమం ఎంతగానో సహాయపడుతుంది. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు జుట్టుపై ఎంతగానో ప్రభావం చూపుతాయి. దీని కారణంగా అన్ని రకాల జుట్టు సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది.
ఈ రెమెడీని తయారు చేయడానికి కావలసిన పదార్థాలు..
✽ నాలుగు చెంచాల నానబెట్టిన మెంతులు
✽ నాలుగు చెంచాల నానబెట్టిన బియ్యం
✽ రెండు రెమ్మల కరివేపాకు
Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
తయారీ విధానం:
✽ ఈ రెమెడీని తయారు చేసుకోవడానికి రోజు ముందుగానే బియ్యంతో పాటు మెంతులను నానబెట్టుకోవాల్సి ఉంటుంది.
✽ తర్వాత రెండు రెమ్మల కరివేపాకు తీసుకొని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.
✽ మరుసటి రోజు బియ్యంతో పాటు మెంతులను మిశ్రమంలా తయారు చేసుకోవాలి.
✽ ఇలా తయారు చేసుకున్న మిశ్రమంలోని కరివేపాకును కూడా వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి..అంతేకాకుండా తగినన్ని నీటిని కూడా కలుపుకోవాల్సి ఉంటుంది.
✽ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని 20 నిమిషాల పాటు పక్కన పెట్టి జుట్టుకు అప్లై చేసుకోవాలి.
✽ ఈ మిశ్రమాన్ని వారానికి రెండు నుంచి మూడుసార్లు జుట్టుకు అప్లై చేసుకోవడం వల్ల సులభంగా జుట్టు రాలడం తగ్గుతుంది.
Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి