Weight Loss Tips: ఆరోగ్యం మహాభాగ్యమంటారు. అందుకే సాధ్యమైనంతవరకూ ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఫిట్ అండ్ స్లిమ్‌గా ఉంటేనే ఆరోగ్యం అనేది సాధ్యమౌతుంది. కానీ ఇటీవలి కాలంలో స్థూలకాయం, బెల్లీ ఫ్యాట్ ప్రధాన సమస్యలుగా మారిపోయాయి. డైట్లో లేదా జీవన శైలిలో కొన్ని మార్పులు చేస్తే శరీరంలో పేరుకున్న కొవ్వును సులభంగా కరిగించుకోవచ్చు.
ప్రతి మనిషి ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండేందుకు చాలా ప్రయత్నలు చేస్తుంటాడు. ఎందుకంటే ప్రస్తుత తరుణంలో ఇది అవసరం. చాలామందిలో అధిక బరువు లేదా స్థూలకాయం ఓ సమస్యగా బాధిస్తోంది. స్థూలకాయం కారణంగా తరచూ అనారోగ్య సమస్యలు ఎదుర్కోవల్సి వస్తోంది. కొంతమందికి పొట్ట చుట్టూ, నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోతుంటుంది. ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే కేవలం వ్యాయామం ఒక్కటే పరిష్కారం కాదు. డైట్ కూడా అవసరం.
ప్రతి రోజూ రాత్రి భోజనం ఎప్పుడూ తేలిగ్గా ఉండాలి. అంటే త్వరగా జీర్ణమయ్యేదిగా ఉండాలి. దీనివల్ల నిద్ర సంపూర్ణంగా ఉండటమే కాకుండా బరువు నియంత్రణలో దోహదపడుతుంది. డిన్నర్ అనేది ఎప్పుడూ రాత్రి నిద్రకు కనీసం గంట ముందు ఉండేట్టు చూసుకోవాలి. రాత్రి భోజనం తేలిగ్గా ఉంటే..బరువు కూడా నియంత్రణలో ఉంటుంది.
రాత్రి వేళ భోజనంలో పెసర పప్పు మంచి ప్రత్యామ్నాయం. ఇందులో పోషక పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి. రక్తపోటు నియంత్రణలో ఉపయోగపడుతుంది. బరువు తగ్గించుకోవాలనుకుంటే..డిన్నర్లో పెసరపప్పు తీసుకోవాలి.
ఇక మరో బెస్ట్ ఫుడ్ సగ్గుబియ్యం. ఇందులో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉండి తినేందుకు తేలిగ్గా ఉంటుంది. రోజూ కూడా తిన్నా సమస్య ఉండదు. సగ్గుబియ్యంతో ఖిచిడీ చేసుకుని తింటే మంచి ఫలితాలుంటాయి. ఇందులో నెయ్యి, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, బంగాళదుంప, సగ్గుబియ్యం, ధనియా కలవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. బొప్పాయి సలాడ్ కూడా చాలా మంచిది. ముఖ్యంగా మలబద్ధకం వంటి సమస్యలకు అద్భుతంగా పనిచేస్తుంది. రోజూ క్రమం తప్పకుండా ఈ చిట్కాలు పాటిస్తే వారాల వ్యవధిలోనే స్థూలకాయం సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. మీ నడుము, పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వు కరిగించుకోవచ్చు.
Also read: Metabolism Tips: మెటబోలిజం అంటే ఏంటి, మెరుగుపర్చుకునేందుకు ఏం చేయాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook