Reduce Cholesterol with Amalaki, Haridra And Sesame Seeds: శరీరంలో కొలెస్ట్రాల్ విచ్చల విడిగా పెరగడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా సిరల్లో కొవ్వు పరిమాణాలు పేరుకుపోవడం వల్ల గుండె పోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి దీని కారణంగా మరిణించే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి చెడు కొలెస్ట్రాల్ పరిమాణాలు విచ్చలవిడిగా పెరిగితే నియంత్రించుకోవడం చాలా మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీని కోసం ప్రతి రోజూ ఆయుర్వేద నిపుణులు సూచించిన పలు చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. ఈ ఆయుర్వేద ఔషధాలను ప్రతి రోజూ వినియోగిస్తే మంచి ఫలితాలు పొందడమేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. అయితే ఎలాంటి మూలకాలను వినియోగించడం వల్ల సులభంగా కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ మూలికలు కొలెస్ట్రాల్‌కు దివ్యౌషధం:
అమలాకి (ఎంబ్లికా అఫిసినాలిస్):
ఆయుర్వేద మూలికల్లో అమలాకీ ఒకటి.. ఇందులో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధిక పరిమాణంలో లభ్యమవుతాయి. అంతేకాకుండా ఇది రక్త ప్రసరణను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే గుణాలు సిరల్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను సులభంగా తగ్గిస్తుంది.
హరిద్ర:
హరిద్రాలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు అధిక పరిమాణంలో ఉంటాయి. దీనిని ఎక్కువగా దీర్ఘకాలిక వ్యాధుల ఔషధాలలో వినియోగిస్తారు. కాబట్టి దీనిని క్రమం తప్పకుండా వినియోగిస్తే.. కొలెస్ట్రాల్‌కు సులభంగా నియంత్రిస్తుంది. అంతేకాకుండా సిరల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను కూడా శుభ్రపరుస్తుంది. దీంతో గుండె పోటు సమస్యలకు కూడా సులభంగా తగ్గుతాయి.
నువ్వులు:
నువ్వులు కూడా శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలను తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. శీతాకాలంలో వీటిని వినియోగించడం వల్ల కొలెస్ట్రాల్ సులభంగా కరుగుతుంది. అయితే నల్ల నువ్వులను ప్రతి రోజూ వినియోగిస్తే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కగుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
పునర్నవ మూలిక:
పునర్నవ కొలెస్ట్రాల్‌ను తగ్గించడమేకాకుండా తీవ్ర వ్యాధులైన ఆస్తమా నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
Also Read: Anasuya Bharadwaj Family : ఫ్యామిలీతో కలిసి చిల్.. వీకెండ్‌లో అనసూయ సందడి.. పిక్స్ వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook