How To Reduce Cholesterol In 20 Days: శరీరంలోని కొలెస్ట్రాల్ పెరగడం కారణంగా ఎన్నో రకాల దీర్ఘకాలిక వ్యాధులు రావచ్చు. ముఖ్యంగా గుండెలోని ధమనులు, సిరల్లో పనితీరు మారే అవకాశాలు కూడా ఉన్నాయి. దీని కారణంగా తీవ్ర గుండెపోటుతో పాటు అధిక రక్తపోటు సమస్యల బారిన పడే అవకాశాలున్నాయి. కాబట్టి ఇప్పటికే చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్న వారు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా శరీరంలోని కొవ్వును తగ్గించుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ కొవ్వు కారణాల వల్ల వచ్చే అనారోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకొని చాలామంది ఖరీదైన వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారు. దీనికి బదులుగా ఇంట్లోనే ఉండి ఆరోగ్య నిపుణులు సూచించిన కొన్ని చిట్కాలు పాటిస్తే త్వరలోనే మంచి ఫలితాలు పొందుతారు.
చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్న వారు బయటి ఆహారాలను అతిగా తీసుకుంటూ ఉంటారు. అయితే ఇలా తీసుకునేవారు స్ట్రీట్ ఫుడ్‌తో సహా అనారోగ్యకరమైన ఆహారాలను తినడం మానుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా చాలామంది స్వీట్లను ఇష్టపడే తింటూ ఉంటారు. వీటి వల్ల కూడా శరీరంలోని కొలెస్ట్రాల్ పేరుకుపోయే అవకాశాలున్నాయి. కాబట్టి వీటిని తినడం మానుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
Also Read: Minister KTR: వారికి సెలవులు రద్దు.. అధికారులకు కేటీఆర్ కీలక ఆదేశాలు
పొట్ట చుట్టూ కొలెస్ట్రాల్, శరీరంలోని పేరుకుపోయిన కొవ్వును తగ్గించుకోవడానికి ప్రతిరోజు ఉదయం తప్పకుండా వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. ఉదయాన్నే రెండు కిలోమీటర్ల వరకు వాకింగ్ చేసి.. 30 నిమిషాల పాటు వ్యాయామాలు చేయడం వల్ల త్వరలోనే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా శరీరం కూడా దృఢంగా, చాలా యాక్టివ్‌గా తయారవుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా వ్యాయామాలతో పాటు వాకింగ్ చేయాల్సి ఉంటుంది.
కొంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోలేకపోతున్నారు. అయితే ఇలాంటి వారు తప్పకుండా ఆహారాలను డైట్ పద్ధతిలో తీసుకోవాల్సి ఉంటుంది. కొలెస్ట్రాల్ కరిగించుకునే క్రమంలో ఆహారాలు డైట్ పద్ధతులు తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి డైట్ లో భాగంగా ఉదయం తీసుకునే అలవాహారంలో తప్పకుండా ఓట్స్ ఉండేటట్లు చూసుకోవాలి. అల్పాహారంలో వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా తీవ్రదీర్ఘకాలిక వ్యాధులు కూడా దరిచేరమని ఆరోగ్య నిపుణులు తెలిపారు.
Also Read: Minister KTR: వారికి సెలవులు రద్దు.. అధికారులకు కేటీఆర్ కీలక ఆదేశాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి