How to Strong Bones: ఈ 12 ఆహారాలే మీ ఎముకలను దృఢంగా చేస్తాయి!

How to Strong Bones In 1 Week: ప్రస్తుతం చాలా మందిలో ఎముకలు దృఢత్వాన్ని కోల్పోతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి ఆహారాలను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 3, 2023, 09:46 AM IST
How to Strong Bones: ఈ 12 ఆహారాలే మీ ఎముకలను దృఢంగా చేస్తాయి!

How to Strong Bones In 1 Week: ప్రస్తుతం చాలా మందిలో 30 ఏళ్లు దాటిన తర్వాత ఎముకలు బలహీనంగా మారడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా ఎముకలు దృఢత్వాన్ని కోల్పోతున్నాయి. ఇలాంటి సమస్యలు పురుషులతో పొలిస్తే స్త్రీలలో అధికం ఉంటున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా శరీర ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా మేలని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ప్రతి రోజు తీసుకునే ఆహారాలు కూడా ఎముకలపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ఎలాంటి ఆహారాలు తీసుకోవడం వల్ల ఎముకల బలహీనత సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

వీటిని ఆహారంలో తీసుకుంటే ఎముకలు దృఢంగా మారుతాయి:
40 ఏళ్ల తర్వాత కూడా ఎముకలు దృఢంగా ఉండడానికి తప్పకుండా మంచి ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి రోజు కాల్షియం, విటమిన్ డి, పోషకాలు కలిగిన ఆహారాలు తీసుకుంటే ఎముకలు దృఢంగా శక్తి వంతంగా మారతాయి. కాబట్టి ప్రతి రోజు ఈ ఆహారాలు తీసుకోండి.

Also Read:  Nani 30 Look : లుక్ రివీల్ కాకూదనే అలా పెట్టాడా?.. నాని పోస్ట్ వైరల్

  • ఆకుపచ్చ కూరగాయలు
  • పాలు, పాల ఉత్పత్తులు
  • ఓట్స్
  • ఖిచ్డీ
  • గింజలు 
  • గుడ్డు 
  • క్యారెట్
  • బఠానీ
  • తృణధాన్యాలు
  • పండ్లు
  • చిలగడదుంప 
  • పుట్టగొడుగులు 
  • ముల్లంగి
  • బచ్చలికూర
  • మఖానా
  • అంజీర్
  • సలాడ్

తప్పకుండా ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది:
ప్రతి రోజు పచ్చి కూరగాయలతో తయారు చేసిన సలాడ్‌ తినడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
పాలలో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది..కాబట్టి ప్రతి రోజు రెండు సార్లు పాలు తాగాల్సి ఉంటుంది. 
కొవ్వులు తక్కువ పరమాణంలో ఉండే ఆహారాలు తీసుకోవాలి.
ప్రతి రోజు ఆహారంలో పప్పులు అధిక పరిమాణంలో తీసుకోవాలి.
 నాన్ వెజ్ ఐటమ్స్ తినడం వల్ల కూడా ఎముకలు దృఢంగా తయారవుతాయి. 
శరీరాన్ని ప్రతి రోజు హైడ్రెట్‌గా ఉంచాల్సి ఉంటుంది. దీని కోసం 8 నుంచి 10 గ్లాసుల నీటిని తాగాల్సి ఉంటుంది
ప్రతి రోజు ఫ్రూట్ జ్యూస్‌లు తాగడం వల్ల కూడా మంచి ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఎముకలు దృఢంగా తయారు కావడానికి ప్రతి రోజు వర్కవుట్స్ కూడా చేయాల్సి ఉంటుంది. 

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read:  Nani 30 Look : లుక్ రివీల్ కాకూదనే అలా పెట్టాడా?.. నాని పోస్ట్ వైరల్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News