Anti Aging Drinks: వృద్ధాప్య ఛాయల్ని తొలగించి..యవ్వనంగా ఉంచే డ్రింక్స్ ఏంటో తెలుసా

Anti Aging Drinks: ముఖంలో లేదా శరీరాకృతిలో వృద్ధాప్యఛాయలకు దూరంగా ఉండాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. దీనికి పరిష్కారం మనచుట్టూనే ఉంది. కొన్ని రకాల పండ్లు, కూరగాయల జ్యూస్‌తో వద్ధాప్య లక్షణాలను దూరం చేయవచ్చు..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 25, 2022, 09:41 PM IST
Anti Aging Drinks: వృద్ధాప్య ఛాయల్ని తొలగించి..యవ్వనంగా ఉంచే డ్రింక్స్ ఏంటో తెలుసా

Anti Aging Drinks: ముఖంలో లేదా శరీరాకృతిలో వృద్ధాప్యఛాయలకు దూరంగా ఉండాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. దీనికి పరిష్కారం మనచుట్టూనే ఉంది. కొన్ని రకాల పండ్లు, కూరగాయల జ్యూస్‌తో వద్ధాప్య లక్షణాలను దూరం చేయవచ్చు..

బిజీ లైఫ్‌స్టైల్, ఆహారపు అలవాట్లు, చెడు కల్గించే ఆహారం కారణంగా తరచూ ఒత్తిడి లేదా ఆందోళనకు గురవుతుంటాం. మనకు తెలియదు గానీ..దీని ప్రభావం మన ముఖంపై స్పష్టంగా కన్పిస్తుంది. శరీరంలో న్యూట్రియంట్స్ లోపం, కాలుష్యం కారణంగా తక్కువ వయస్సులోనే ముఖంపై వృద్ధాప్య ఛాయలు కన్పిస్తుంటాయి.ఈ పరిస్థితుల్లో మీ చర్మాన్ని పూర్తిగా సంరక్షించుకోవల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి ఆరోగ్యకరమై ఆహారంపై దృష్టి సారించాలి. అప్పుడే యాంటీ ఏజీయింగ్ ప్రక్రియ వేగవంతమౌతుంది. ఏం తాగితే వృద్ధాప్య ఛాయలు తొలగిపోయి..నిత్య యవ్వనంగా కన్పిస్తామో చూద్దాం..

క్యారట్ జ్యూస్

క్యారట్ అనేది బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కలిగిన పదార్ధం. ఇందులో ల్యూటిన్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. దీనివల్ల మెదడుకు లాభం కలుగుతుంది. క్యారట్‌లో ఉన్న బీటా కెరోటిన్ చాలా ఉపయోగకరం. క్రమం తప్పకుండా క్యారట్ జ్యూస్ తీసుకుంటే మీ చర్మం కాంతివంతంగా మారుతుంది. 

దానిమ్మ జ్యూస్

దానిమ్మను ఆరోగ్యపు ఖజానాగా పిలుస్తారు. ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్, పోలీఫెనోల్స్ చాలా సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మానికి చాలా లాభదాయకమైనవి. అంతేకాకుండా దానిమ్మతో కేన్సర్ నుంచి రక్షించుకోవచ్చు, అధిక రక్తపోటును నియంత్రించవచ్చు.

బ్లాక్ గ్రేప్ జ్యూస్

బ్లాక్ గ్రేప్‌లో కెరోటినాయిడ్ కాంపౌండ్స్ ఉంటాయి. నల్ల ద్రాక్ష జ్యూస్ క్రమం తప్పకుండా సేవిస్తే..ఒక మంచి యాంటీ ఏజీయింగ్ డ్రింక్‌గా పనిచేస్తుంది. అంతేకాకుండా శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. దీనివల్ల గుండెకు సంబంధించిన సమస్యలు కూడా దూరమౌతాయి.

బీట్‌రూట్ జ్యూస్

బీట్‌రూట్ ఆరోగ్యానికి చాలా మంచిది. బీట్‌రూట్ జ్యూస్ శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్‌ను పెంచుతుంది. బీట్‌రూట్ జ్యూస్ క్రమం తప్పకుండా సేవించడం వల్ల ఏజీయింగ్ ప్రక్రియ మందగిస్తుంది. ముఖంపై వృద్ధాప్య ఛాయలు తగ్గిపోతాయి.

Also read: Turmeric Water Benefits: పరగడుపున పసుపు నీళ్లు తాగితే..లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు, ఆ సమస్యకు చెక్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News