Milk for Moisturiser: మాయిశ్చరైజింగ్ గుణాలు ఉన్న బ్యూటీ ఉత్పత్తులను వినియోగిస్తాం. అయితే, పాలను కూడా మాయిశ్చరైజింగ్ చేసుకోవడానికి వాడొచ్చు. ఇది సహజసిద్ధంగా మీ చర్మానికి మాయిశ్చర్‌ను అందిస్తుంది. ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా పచ్చిపాలను ముఖానికి అప్లై చేయడం వల్ల మీ చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. మీ ముఖానికి మెరుగైన ఛాయను అందిస్తుంది. మీ ముఖానికి మంచి ప్యాక్ మాదిరి కూడా వేసుకుంటే మంచి ఫలితాలను పొందుతారు. మన ముఖానికి పాలను ఉపయోగించడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం.
యాక్నేక్‌కు చెక్..
పాలలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. కానీ, ఇందులో లోతుగా శుభ్రం చేస్తుంది. ముఖంపై ఉన్న రంధ్రాలను యాక్నేకు నివారిస్తుంది. ముఖంపై ఉన్న బ్యాక్టిరియాను తొలగిస్తుంది. ముఖానికి పాలను మాస్క్ మాదిరి కూడా వేసుకోవాలి. ఇది ముఖంపై వాపును తొలగించి యాక్నే రాకుండా నివారిస్తుంది.
స్కిన్ మాయిశ్చరైజేషన్..
ముఖానికి పాలను రాసుకోవడం వల్ల ముఖానికి పోషకాన్ని అందించి మాయిశ్చరైజర్‌ను అందిస్తుంది. ముఖానికి మాయిశ్చర్ గుణాలను పాలు అందిస్తుంది. ముఖాన్ని మృదువుగా మారుస్తుంది. మచ్చలేని చర్మాన్ని అందిస్తుంది.
ఎక్స్‌ఫోలియేటర్..
పచ్చిపాలను బీటా హైడ్రాక్సి యాసిడ్ ఉంటుంది. ఇది మన చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ముఖంపై ఉన్న డెడ్ స్కిన్ సెల్స్‌ను తొలగించి ముఖానికి గ్లోయింగ్ స్కిన్ అందిస్తుంది.
ఇదీ చదవండి: అకీరా, ఆద్యాకు అన్ని ఇచ్చా.. పవన్ ఎమోషనల్!!
వృద్ధాప్య ఛాయలు..
పచ్చిపాలను ముఖంపై ఉపయోగించడం వల్ల ముఖంపై రానున్న వృద్ధాప్య ఛాయలను ఆలస్యం చేస్తుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. పాలలో విటమిన్ డీ కూడా ఉంటుంది. ఇది చర్మాన్ని సాగేలా చేస్తుంది. పాలను వివిధ రకాలుగా మన ముఖంపై వాడొచ్చు. ఫేస్ మాస్కులు, ఫేస్ ప్యాకులు వేసుకోవచ్చు. దీంతో మీ ముఖ రంగు కూడా మెరుగవుతుంది. అంతేకాదు, పాలతో ఐస్ క్యూబ్స్ కూడా తయారు చేసుకోవచ్చు. రోజూ ముఖంపై ఈ ఐస్ క్యూబ్స్ తో ముఖాన్ని మసాజ్ చేయాలి. దీంతో మీ ముఖం మెరిసిపోతుంది.
ఇదీ చదవండి: రోజూరాత్రి పడుకునేముందు ఈ ఒక్క ఆయిల్‌తో మీ ముఖం మసాజ్ చేయండి.. హిరోయిన్ వంటి అందం మీదే..
గ్లోయింగ్ స్కిన్..
పచ్చిపాలను ముఖానికి ఉపయోగించడంలో ముఖం మెరిసిపోతుంది. మీ ముఖంపై ఈవెన్ స్కిన్ టోన్ రావడానికి పాలను ఉపయోగించండి. ఇందులో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మంపై డెడ్ స్కిన్ సెల్స్ తొలగించి, ముఖంపై మెరుపు వస్తుంది. చర్మాన్ని డ్యామేజ్ అవ్వకుండా రిపెయిర్ చేస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter