Turns White Hair to Black Just in 9 Days: ప్రస్తుంత చాలా మంది చిన్న వయస్సులోనే తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి కెమికల్ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ వినియోగిస్తున్నారు. వీటిని వినియోగించడం వల్ల ఫలితాలున్నప్పటికీ భవిష్యత్లు పలు రకాల సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా హోం రెమెడీస్ వినియోగించాల్సి ఉంటుంది.
వాస్తవానికి మెలనిన్ అనేది ఒక రకమైన వర్ణద్రవ్యం.. ఇది మన జుట్టును నల్లగా చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అయితే తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా జుట్టులో మార్పులు చూడొచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఎలాంటి హోం రెమెడీస్ వినియోగించడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారుతుందో తెలుసుకుందాం.
నల్ల జుట్టు కోసం తప్పకుండా పాటించాల్సిన హోం రెమెడీస్:
- మెంతి గింజల వల్ల జుట్టుకు కలిగే ప్రయోజనాలు:
- ఒక గిన్నెలో కొబ్బరి, బాదం నూనెను కలపి మరిగించాలి.
- అందులోనే ఒక చెంచా మెంతిపొడి వేయాలి.
- అంతే సులభంగా హెయిర్ ఆయిల్ రెడీ అయినట్లే..
- ఈ నూనెను రాత్రి నిద్రపోయే ముందు అప్లై చేస్తే మంచి ఫలితాలు పొందుతారు.
కరివేపాకు నూనె సహాయంతో జుట్టు నల్లగా నిజంగా మారుతుందా..?
- కరివేపాకును ఓ గిన్నెలో వేసి అందులో నూనెను పోసుకుని బాగా మరిగించాలి.
- ఇలా ఉడకబెట్టిన తర్వాత, చల్లారనివ్వండి.
- ఈ కరివేపాకు నూనెను జుట్టుకు బాగా అప్లై చేసి మసాజ్ చేసి శుభ్రం చేసుకోవాలి.
నిమ్మరసం, బాదం నూనె :
- బాదం నూనెలో నిమ్మరసం మిక్స్ చేసి బాగా కలపాలి.
- ఇలా కలిపిన నూనెను జుట్టుకు అప్లై చేసుకోవాలి.
- మసాజ్ చేసి 30 నిమిషాల తర్వాత జుట్టును శుభ్రం చేసుకోవాలి.
- పై చిట్కాలు జుట్టును నల్లగా చేయడానికి సహాయపడుతుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు మరియు సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Inter Exams 2023: ఇవాళ్టి నుంచే ఏపీ, తెలంగాణల్లో ఇంటర్ పరీక్షల
Also Read: IPL 2023: ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఆర్సీబీకి షాక్.. కీలక ప్లేయర్ ఔట్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook