White Tea For Weight Loss: బరువు తగ్గడానికి చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ శరీర బరువు తగ్గలేకపోతున్నారు. అయితే ఊబకాయం వంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొలెస్ట్రాల్, శరీర బరువు తగ్గించుకోవడానికి చాలా మంది గ్రీన్ టీలను విచ్చల విడిగా తాగుతున్నారు. అయితే దీనికి బదులుగా వైట్ టీలను తాగాల్సి ఉంటుంది. ఈ టీలో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి దీనిని ప్రతి రోజూ తాగడం వల్ల దీర్ఘకాలీక వ్యాధులు కూడా దూరమవుతాయి. అంతేకాకుండా ఈ టీ చర్మ సమస్యలను కూడా తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ టీని ప్రతి రోజూ తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
వైట్ టీలో లభించే పోషకాలు ఇవే:
వైట్ టీలో పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. అంతేకాకుండా యాంటీమైక్రోబయల్ పరిమాణాలు కూడా అధికంగా లభిస్తాయి. కాబట్టి ఈ టీని ప్రతి రోజూ తాగడం వల్ల వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ టీలో పాలీఫెనాల్స్, ఫైటోన్యూట్రియెంట్స్ కూడా ఉంటాయి.
వైట్ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:
>>ఈ టీలో టానిన్లు, ఫ్లోరైడ్,ఫ్లేవనాయిడ్లు సంవృద్ధిగా లభిస్తాయి. కాబట్టి ఈ టీని తాగడం వల్ల శరీరానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ దూరమవుతాయి.
>>వైట్ టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. శరీర బరువును తగ్గించుకునే వారు దీనిని తాగడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి.
>>ఇది ఆకలిని కూడా సులభంగా నియంత్రిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
>>ముఖ్యంగా పొట్ట సమస్యలు, అజీర్తి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ ఈ టీ తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
>>ప్రతి రోజూ వైట్ టీని తాగడం వల్ల మలబద్ధకం, గ్యాస్ సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
>>వైట్ టీ తాగడం వల్ల అలసట తగ్గి.. రిఫ్రెష్‌గా ఉంటారు
>>ముఖ చర్మం వేలాడం వంటి సమస్యలతో బాధపడేవారికి ఔషధంలా పని చేస్తుంది.
Also Read: Pawan Kalyan: చంద్రబాబుకు అండగా పవన్ కళ్యాణ్ సపోర్ట్.. వైసీపీ పాలనలోనే ఇలా చూస్తున్నాం..
Also Read: Interest Free Loan: ఈ రాష్ట్ర రైతులకు గుడ్‌న్యూస్.. రూ.5 లక్షల వరకు వడ్డీలేని రుణం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook