Kalavedika Music Awards: భాగ్యనగరంలో గ్రాండ్ గా కళావేదిక ఫిల్మ్ మ్యూజిక్ అవార్డ్స్..

Kalavedika Music Awards: మన దగ్గర సినిమా వాళ్లను ప్రోత్సహించే భాగంగా ప్రభుత్వంతో పాటు పలు ప్రైవేటు సంస్థలు అవార్డుల కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటాయి. ఈ కోవలో కళావేదిక గత 59 యేళ్లుగా సినీ రంగంలో పాటలకు సంబంధించిన అవార్డులు ఇస్తూ వస్తోంది. తాజాగా మరోసారి హైదరాబాద్ వేదికగా కళావేదిక అవార్డులు ప్రధానం చేసింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Jan 7, 2025, 01:50 AM IST
Kalavedika Music Awards: భాగ్యనగరంలో గ్రాండ్ గా కళావేదిక ఫిల్మ్ మ్యూజిక్ అవార్డ్స్..

Kalavedika Music Awards: బస్సా శ్రీనివాస్ గుప్త, భువన గారి ఆధ్వర్యంలో కళావేదిక అవార్డ్స్ 59వ వార్షికోత్సవం హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకలో  గీత రచయితలకు, గాయనీగాయకులకు, సంగీతదర్శకులకు అవార్డులు అందించారు. ఆర్.వి. రమణమూర్తి ఎటువంటి ఆశయాల మేరకు కళావేదికను స్థాపించారో ఆ ఆశయాలను ఆయన కుమార్తె భువన సఫలం చేస్తూ ఈ అవార్డుల కార్యక్రమాన్ని ముందుకు తీసుకొస్తున్నారు.

జనవరి 4వ తేదీన హైదరాబాద్ లోని ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్ లో జరిగిన ఈ ప్రోగ్రామ్ కు  వాసవి గ్రూప్స్, ఉప్పల ఫౌండేషన్, మనెపల్లి జ్యువలరీ శ్రీ చరణ, కమ్యూనికేషన్ సదరన్ ట్రావెల్స్ పార్టీలు స్పాన్సర్లు సహాయక సహకారాలతో ఈ కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్ పర్సన్ శ్రీమతి కల్వ సుజాత గుప్త, డైరెక్టర్స్ ముప్పలనేని శివ, ఇంద్రగంటి మోహన్ కృష్ణ, మ్యూజిక్ డైరెక్టర్  ఆర్.పి.పట్నాయక్, ఎమ్ ఎమ్ శ్రీలేఖ, సింగర్ కౌసల్య, ప్రఖ్యాత సినీనటులు నందమూరి తారకరామారావు గారి మనవరాలు నందమూరి రూపాదేవి, కొల శ్రీనివాస్, గంధం రాములు, ఎల్.ప్రసన్నకుమార్, వినయ్ హరిహారన్ తదితరులు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు.

2024లో విడుదలై ఘనవిజయాలను సాధించిన సినిమాల్లో కృషి చేసిన లిరిసిస్టులకు , మ్యూజిక్ డైరెక్టర్స్ కు , గాయనీ గాయకులను, సౌండ్ ఇంజనీర్లను... ఇలా పాట రెడీ కావడనాికి శ్రమపడే ప్రతి  కళాకారున్ని కళావేదికగా సత్కరించారు.  భవిష్యత్తులో ఇలాగే ఆర్.వి.రమణమూర్తి ఆశయాల మేరకు కళావేదిక నిరంతరం పాటుపడుతోందని ఆమె కుమార్తె భువన తెలియజేశారు.

ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..

ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News