Satya moview review: స‌త్య మూవీ రివ్యూ.. ప్రేక్ష‌కుల‌ను మెప్పించిందా..

Satya Movie Review: స‌త్య మూవీ పేరు విన‌గానే మ‌న‌కు రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించి స‌త్య మూవీ గుర్తుకు వ‌స్తుంది. ముంబై మాఫియా బ్యాక్ గ్రౌండ్‌లో వ‌చ్చిన ఆ మూవీ అప్ప‌ట్లో సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. తాజాగా చాలా యేళ్ల త‌ర్వాత అదే స‌త్య టైటిల్‌తో సినిమా రావ‌డంతో ఈ సినిమాపై అంచ‌నాలు పెరిగాయి. మ‌రి అంచ‌నాలను ఈ సినిమా అందుకుందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

Written by - TA Kiran Kumar | Last Updated : May 10, 2024, 10:20 AM IST
Satya moview review: స‌త్య మూవీ రివ్యూ.. ప్రేక్ష‌కుల‌ను మెప్పించిందా..

మూవీ రివ్యూ.. స‌త్య
నటీనటులు– హమరేశ్, ప్రార్ధనా సందీప్, ‘ఆడుగాలం’ మురుగదాస్, సాయిశ్రీ, అక్షయ తదితరులు
ఎడిటర్‌– కె .సత్యనారయణ
సినిమాటోగ్రఫీ– ఐ.మరుదనాయగం
సంగీతం– సుందరమూర్తి కె.వి
నిర్మాత– శివమల్లాల
కథ, దర్శకత్వం– వాలీ మోహన్‌దాస్‌
విడుద‌ల తేది - 10-5-2024
                        
అంతా కొత్త‌వాళ్ల‌తో జ‌ర్న‌లిస్ట్ నుంచి నిర్మాత మారిన శివ మ‌ల్లాల నిర్మించిన చిత్రం స‌త్య‌. ఒకప్ప‌టి ఆర్జీవి సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ టైటిల్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా ఆడియ‌న్స్‌ను మెప్పించిందా లేదా మ‌న మూవీ రివ్యూలో చూద్దాం..

క‌థ విష‌యానికొస్తే..

హీరో సత్యమూర్తి గవర్నమెంట్‌ కాలేజిలో ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ చదువుకుంటూ ఆడుతూ, పాడుతూ హాయిగా తిరిగే టీనేజ్‌ కుర్రాడు. అనుకోకుండా ఓ రోజు స్టూడెంట్స్‌ క్రికెట్‌ ఆడుకుంటుంటే వాళ్లల్లో వాళ్లకి జరిగిన గొడవల్లో స్టూడెంట్స్ ఒక‌రిపై ఒక‌రు దాడి చేసుకుంటారు.  హీరో సత్య వాళ్లందర్ని తప్పించుకునే క్రమంలో రోడ్డు మీదకు వచ్చి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు.  ఆ త‌ర్వాత కాలేజీలో పోట్లాడుకున్న విద్యార్ధుల‌ను  ఆ ఏరియా పోలీసులు ల్ని అరెస్ట్ చేస్తారు.  స‌త్య నాన్న ‘ఆడుగాలం’ మురుగదాస్‌ బాగా చదువుతూ మార్కులు తెచ్చుకునే సత్య చెడు సావాసాల వల్లే పోలీస్‌స్టేషన్‌ మెట్లు ఎక్కవలసి వచ్చింది అనుకుని అర్జెంట్‌గా తను చదివే గవర్నమెంట్‌ కాలేజీనుండి సత్యను మార్చాలని తండ్రిగా తన ప్రయత్నాలు మొదలెడతాడు.

గవర్నమెంట్‌ కాలేజీలో ఏ ఫీజలు కట్టే పనిలేకుండా వాళ్లు నివాసముండే బస్తీలో చాకలి పనిచేసుకుంటూ పొట్ట పోసుకుని హాయిగా సాగిపోతున్న తమ జీవితాల్లోకి ప్రైవేట్‌ కాలేజి, ఫీజులు అనేవి తెలియకుండానే ఎంటర్‌ అయిపోతాయి. సత్యకి తను చదివే కాలేజి, ఫ్రెండ్స్‌ని వదిలి వెళ్లటం అసలు ఇష్టం ఉండదు. కానీ అమ్మ,నాన్న కోసం సరే అంటాడు. అక్కడనుండి తను ఓ రిచ్‌ ప్రైవేట్‌ కాలేజికి వెళ్తాడు. అక్కడ తన కు పార్వతి (ప్రార్ధన సందీప్‌) పరిచయమవుతుంది. వాళ్లిద్దరి మధ్య ఏం జరిగింది? అక్క‌డ కాలేజీలో స‌త్య ఎలాంటి ప‌రిస్థితుల‌ను ఫేస్ చేయాల్సి వ‌చ్చింది. ?  కొత్త కాలేజీలో  టీచర్స్‌ తనను ఎలా చూశారు? ఇష్టం లేకుండా చేరిన కాలేజితో తనకున్న అనుబంధం ఏమిటి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

క‌థ‌నం, టెక్నికల్ విభాగానికొస్తే..
 
సత్య చిత్ర కథకుడు– దర్శకుడు వాలీ మోహన్‌దాస్‌ దర్శకునిగా తన టేస్ట్‌ ఎలా ఉంటుందో ఫ‌స్ట్ మూవీలోనే చూపించారు. ముఖ్యంగా మ‌ధ్య త‌ర‌గ‌తి జీవితాల్లో ప్రైవేటు కాలేజీ వ్య‌వహారాలతో ఎలాంటి ఇబ్బందులు ప‌డ్డారు. మ‌రోవైపు గ‌వ‌ర్న‌మెంట్ కాలేజీలో జ‌రిగే విద్యార్దుల మ‌ధ్య చిన్న చిన్న అల్ల‌ర్ల‌ను ఎంతో హృద్యంగా చెప్పే ప్ర‌యత్నం మెచ్చుకోద‌గినది. కొన్ని సీన్స్‌లో మధ్యతరగతి వాడు ఎలా ఉండాలో, ఎంతలో ఉండాలో చెప్పినతీరు ఎంతో బావుంది. మరుదనాయగంకెమెరా వర్క్ బాగుంది. సత్యనారాయణ  ఎడిటింగ్ వ‌ర్క్ ఆక‌ట్టుకుంటుంది.  సత్య సినిమా సంగీత దర్శకుడు సుందరమూర్తి  బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తో ఈ సినిమాని మరో స్థాయికి తీసుకువెళ్లాడు.  
 
నటీనటుల పనితీరు–
హీరో హమరేశ్, సీనియర్‌ యాక్టర్‌ ఆడుగాలం మురుగదాస్‌ పోటా పోటిగా నటించారు. తండ్రి, కొడుకులతో పాటు అమ్మ,అక్క పాత్రలు కూడా ఎంతో హృద్యంగా ప్రేక్ష‌కులు క‌నెక్ట్ అవుతారు. తండ్రి కొడుకుల మధ్యలో ఉండే బ్యూటిఫుల్‌ ఎమోషన్స్‌తో పాటు కొడుకును ఎవరన్న ఏమన్నా అంటే తట్టుకోలేని తండ్రి పాత్రలో మురుగదాస్‌ నటించిన తీరు బాగుంది.

ప్లస్‌ పాయింట్స్‌–  

న‌టీన‌టుల న‌ట‌న

ఇంటర్వెల్‌ సీన్,

ప్రీ–క్లైమాక్స్‌

మైనస్‌ పాయింట్స్‌

ఒకే సీన్‌ని చాలా సార్లు చూసిన ఫీలింగ్‌

ఫస్ట్‌ హాఫ్‌

డబ్బింగ్‌లో చిన్న చిన్న లోపాలు

పంచ్ లైన్.. స‌త్య మిడిల్ క్లాస్ మెలోడీస్

రేటింగ్ 2.75/5

Also Read: Pawan Kalyan: పవన్‌కు పెరుగుతున్న 'సినీ మద్దతు'.. చిరు, నాని, రాజ్ తరుణ్‌ మద్దతు పిఠాపురం గ్లాస్‌దేనా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News