BMRCL Reduced Up To 30 Percent On New Fare Hike: మెట్రో ప్రయాణికులకు భారీ శుభవార్త. మెట్రో ధరలను 30 శాతం మేర తగ్గిస్తూ మెట్రో రైలు సంస్థ నిర్ణయం తీసుకుంది. దీంతో మెట్రో ప్రయాణికులకు కొంత భారం తగ్గనుంది. అయితే పెంచిన 50 శాతంలో 30 శాతం తగ్గించగా.. 20 శాతం ధరలు అమల్లోకి రానున్నాయి.
మెట్రో ప్రయాణికుల ఆందోళనతో ఎట్టకేలకు మెట్రో అధికారులు దిగి వచ్చారు. పెంచిన మెట్రో ధరలు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే పెంచిన వాటిలో 20 శాతం ధరల పెంపు కొనసాగనుంది. భారీ భారం నుంచి కొంత ఊరట లభించనుంది.
మెట్రో ధరలు పెంచుతూ బెంగళూరు మెట్రో రైలు కార్పొరేషన్ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఏకంగా 50 శాతం మేర ధరలు పెంచడంతో ప్రయాణికులతోపాటు రాజకీయ పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఫ్రిబవరి 8వ తేదీన భారీగా ఛార్జీలు పెంచడంతో కర్ణాటక ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
ఫిబ్రవరి 9వ తేదీన పెంచిన 50 శాతం ధరలు అమల్లోకి రావడంతో మెట్రో ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మెట్రో స్టేషన్‌ల వద్ద ప్రయాణికులతోపాటు రాజకీయ పార్టీలు కూడా ఆందోళన చేపట్టడం.. దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపడంతో ఎట్టకేలకు ప్రభుత్వం దిగి వచ్చింది.
మెట్రో ఛార్జీల పెంపుపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా సమాలోచనలు చేశారు. ప్రజలపై తీవ్ర భారం మోపడంతో ప్రభుత్వం పునరాలోచన చేసింది. పెంచిన ఛార్జీలు 30 శాతం తగ్గించాలని నిర్ణయించింది.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బెంగళూరు మెట్రో రైలు కార్పొరేషన్ వెల్లడించింది. పెంచిన 50 శాతం ధరల్లో 30 శాతం తగ్గిస్తున్నట్లు మెట్రో అధికారులు ప్రకటించారు. అయితే 20 శాతం ధరల పెరుగుదల యథావిధిగా ఉంటుంది. 20 శాతం ధరలు పెంచడంతో ప్రయాణికులపై భారీగా భారం పడింది. తగ్గించిన ధరలు ఫిబ్రవరి 14 శుక్రవారం నుంచి అమల్లోకి రానున్నాయి.
కర్ణాటకలో ప్రజా రవాణా భారంగా మారుతోంది. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల ధరలు పెంచే ఆలోచనలో ఉన్నారు. ఉచిత బస్సు పథకం అమలుతో భారీ భారం పడడంతో ధరలు పెంచేందుకు యోచిస్తుండగా.. తాజాగా మెట్రో రైలు ధరలు పెంచడంతో కర్ణాటక ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.