Allu Vs Mega Family: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే..

Allu Vs Mega Family: ఒకపుడు మెగా ఫ్యామిలీ అంటే చిరంజీవి,పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్.. వగైరా.. వగైరా అందరు ఒకటే కాంపౌండ్.  కానీ మధ్యలో  అల్లు అర్జున్ తనది మెగా కాంపౌండ్ కాదు. అల్లు కాంపౌండ్ అంటూ కొత్త కుంపటీకి తెర లేపాడు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ను అదే రామ్ చరణ్ అన్ ఫాలో చేసారనే వార్తలు వస్తున్నాయి. నిజంగానే చరణ్.. బన్ని ని అన్ ఫాలో చేసాడా ..? అసలు స్టోరీ విషయానికొస్తే..

1 /7

Allu Vs Mega Family: గత కొన్ని రోజులుగా మెగా, అల్లు కాంపౌండ్ మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి. ఒకరిపై ఒకరు ఇండైరెక్ట్ గా ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నారు.  మెగా హీరోల్లో సోలో హీరోగా పుష్ప తో ప్యాన్ ఇండియా లెవల్లో సంచలనం రేపాడు అల్లు అర్జున్. అప్పటి నుంచి తాను మెగా కాంపౌండ్ హీరో కాదు.. అల్లు కాంపౌండ్ అంటూ చెప్పుకోవడంతో వివాదం మొదలైంది.

2 /7

దీంతో మెగాభిమానులు అల్లు అర్జున్ టార్గెట్ చేసుకొని వెంటాడి వేటాడే పనిలో పడుతున్నారు. పుష్ప 2 సినిమాపై నెగిటిల్ ట్రోల్స్ గట్రా చేసినా.. అవన్నీ ఛేదించుకుంటూ ప్యాన్ ఇండియా లెవల్లో ఇండస్ట్రీ హిట్ గా నిలవడం మెగా కోర్ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు.

3 /7

అది కూడా రాజమౌళి వంటి దర్శకుడు లేకుండా.. సుకుమార్ వంటి దర్శకుడితో ఈ ఫీట్ అందుకోవడంతో మెగాభిమానుల్లో కొంత మంది కంటగింపుగా మారింది. అదే సమయంలో సంక్రాంతికి వచ్చిన ‘గేమ్ చేంజర్’ మూవీ ఇరగదీస్తుంది అనుకుంటే.. ఉసురుమనిపించింది. దీంతో మెగాభిమానులకు ఇది పుండు మీద కారం చల్లినట్లైంది. గేమ్ చేంజర్ ఫ్లాప్ ను అల్లు అభిమానులతో పాటు వైసీపీ సోషల్ మీడియా వాళ్లు తెగ ట్రోల్ చేసారు.

4 /7

తాజాగా అల్లు, చిరంజీవి కుటుంబాలలో  వివాదానికి సంబంధించిన చర్చల మధ్యన ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. అల్లు అర్జున్ పై  పవన్ అభిమానులు అనే కంటే మెగా ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం ప్రారంభమైనటువంటి సందర్భం. అప్పట్లో ఏదైతే పదే పదే పవన్ కళ్యాణ్ గురించి నినాదాలు చేస్తుంటే తను మాట్లాడుతూ.. నేను నేను పవన కళ్యాణ్ అభిమానినే అని చెప్తూ మీరు అసలుసినిమా ఫంక్షన్ ని జరగనివ్వట్లేదు.  ఇట్లైతే నేను ఇక పైన మాట్లాడనన్నారు.

5 /7

అపుడు అల్లు అర్జున్  ప్రారంభమైన కోపం ఆ తర్వాత సర్దుకున్నారు . కానీ ఎపుడైతే.. 2024 ఏపీ ఎలక్షన్స్ సందర్భంగా అల్లు అర్జున్.. వైసీపీలో తన ఫ్రెండ్ శిల్పా రవిని గెలిపించాలని  ప్రచారానికి వెళ్లడంతో అల్లు అర్జున్ పై  మెగాఫ్యాన్స్ కోపం  పీక్స్ కు చేరింది.  జనసేనకు కాదని వైసీపీకి మద్దతు ప్రకటించడం అప్పట్లో పెను దుమారమే రేపింది. ఆ తర్వాత మెగాకుటుంబంలో వాళ్ళు అల్లు అర్జున్ కు  దూరం కావడం ప్రారంభించారు.  అందులో భాగంగా సాయి దుర్గ తేజ్.. ముందుగా అల్లు అర్జున్ ను  అన్ ఫాలో కావడంతో ఇది ప్రారంభమైంది.

6 /7

తాజాగా ఇపుడు రామ్ చరణ్.. అల్లు అర్జున్ ను ఇన్ స్టాలో  అన్ ఫాలో అయ్యాడనే వార్తలు వస్తున్నాయి. అయితే.. రామ్ చరణ్  ముందు నుంచి అల్లు అర్జున్ ను ఫాలోనే కాలేదనే వార్తలు వస్తున్నాయి. ఫాలో కానీ వ్యక్తి ఎలా అన్ ఫాలో అవుతాడనే టాపిక్ మొదలైంది. 

7 /7

కుటుంబంలో ఒకప్పుడు మెగా కాంపౌండ్ హీరోగా ఉన్నటువంటి అల్లు అర్జున్ గా మొన్నే చిరంజీవి చెప్పారు.  ఇట్లాంటి కాంపౌండ్ గేమ్ పౌండ్లు ఏముంది ఉండదు. మా వల్ల ఎదిగినవాడిని మా వాడు మా వల్ల నువ్వు ఎదిగినోడివి అని చెప్పేసి మొన్న ‘పుష్ప 2’ని దెబ్బ కొట్టడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేయడం అందుకు అటు అల్లు అర్జున్ కి ఫ్యాన్స్ ఉన్నారు.