Allu Arjun fan dressed as pushpa 2 in kumbh mela video viral: ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళ వేడుకగా జరుగుతుంది. జన్వరి 13న ప్రారంభమైన కుంభమేళ ఉత్సవం ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. కుంభమేళలకు ఇప్పటి వరకు 39 కోట్ల మంది భక్తులు హజరైనట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. కుంభమేళలో మన దేశం నుంచి మాత్రమే కాకుండా.. ప్రపంచ దేశాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు.
#प्रयागराज- महाकुम्भ स्नान करने के लिए महाराष्ट्र से आए अल्लू अर्जुन के एक फैन ने संगम में आस्था की डुबकी लगाई। इस दौरान फैन ने पुष्पा फिल्म की एक्टिंग करते हुए कई डायलॉग भी सुनाए, जो वहां मौजूद श्रद्धालुओं के बीच चर्चा का विषय बने। उनकी जोश और फिल्मी अंदाज ने सभी का ध्यान… pic.twitter.com/eOj9Ha2mqQ
— Sandhya Dubey (@Sandhyad119) February 5, 2025
ఫిబ్రవరి 12, ఫిబ్రవని 26న మరో రెండు షాహిస్నానాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ రెండు తేదీల్లో కూడా భక్తులు భారీగా తరలి వస్తారని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం కుంభమేళలో ఎక్కడ చూసిన భక్తులు, నాగ సాధులు, అఖాడాల గురువులతో కుంభమేళ ఎంతో భక్తి భావనలు కల్గేలా ఉందని చెప్పుకొవచ్చు.అయితే కుంభమేళలో ప్రస్తుతం ఒక వ్యక్తి పుష్ప రాజ్ లా కాస్ట్యూమ్ వేసుకున్నారు.
అచ్చం పుష్ప సినిమాలో అల్లు అర్జున్ మాదిరిగా డ్రెస్ వేసుకొవడం మాత్రమే కాకుండా.. డైలాగ్ లు కూడా చెబుతూ అక్కడున్న పోలీసుల్ని షాకింగ్ కు గురిచేస్తున్నాడు. పుష్ప మాదిరిగా గడ్డం, పుష్ప స్టయిల్, పుష్ప లా హావా భావాలతో ఆకట్టుకున్నాడు.
Read more: Viral Video: ఏందీ భయ్యా.. ఇంత వైలేంట్‌గా ఉన్నాడు..?.. ఇలా కూడా చలి మంట కాచుకుంటారా..?..
సదరు వ్యక్తి మహా రాష్ట్రకు చెందిన వాడని సమాచారం. ప్రయాగ్ రాజ్ వచ్చిన అతగాడు పుష్ప-2 సినిమాలోని డైలాగులు చెబుతుంటే... కుంభమేళా భద్రతా విధుల్లో ఉన్న పోలీసులు కూడా ఎంజాయ్ చేశారు. అతగాడిని అభినందించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు వావ్.. అచ్చం పుష్పరాజ్ లో ఉన్నాడని కామెంట్లు పెడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter