China warning: వీ చాట్ నిషేధిస్తే...ఐ ఫోన్ నిషేధం తప్పదు

అమెరికా-చైనా ( America china war ) కంపెనీల మధ్య వార్ అధికారికంగా మారింది. నా దేశానిది బ్యాన్ చేస్తే...నీ దేశానిది నిషేధిస్తామనేంతవరకూ వెళ్లింది. తాజాగా ఐ ఫోన్లను బ్యాన్ చేస్తామంటూ చైనా విదేశాంగ ప్రతినిధే నేరుగా బెదిరించడం గమనార్హం.

Last Updated : Aug 28, 2020, 07:33 PM IST
China warning: వీ చాట్ నిషేధిస్తే...ఐ ఫోన్ నిషేధం తప్పదు

అమెరికా- చైనా ( America china war ) కంపెనీల మధ్య వార్ అధికారికంగా మారింది. నా దేశానిది బ్యాన్ చేస్తే...నీ దేశానిది నిషేధిస్తామనేంతవరకూ వెళ్లింది. తాజాగా ఐ ఫోన్లను బ్యాన్ చేస్తామంటూ చైనా విదేశాంగ ప్రతినిధే నేరుగా బెదిరించడం గమనార్హం.

వచ్చే నెల నుంచి చైనాకు చెందిన వీ చాట్ ( V chat ) , టిక్ టాక్ ( TikTok ) ను నిషేధిస్తామని డోనాల్డ్ ట్రంప్ ( Donald trump ) ప్రకటించారు. చైనా దేశపు యాప్స్ ( China apps ) దేశ భద్రతకు ముప్పుుగా పరిణమించాయని వ్యాఖ్యానించారు. దీంతో బీజింగ్-వాషింగ్టన్ ( beijing-washington ) ల మధ్య వాణిజ్యపు యుద్ధం అధికారికమైపోయింది. ఈ నేపధ్యంలో చైనా విదేశాంగ ప్రతినిధి తీవ్రంగానే స్పందించారు. వీ చాట్ ను నిషేధిస్తే..చైనీయులు నిస్సందేహంగా ఐ ఫోన్ ను...యాపిల్ ఉత్పత్తులనను బహిష్కరిస్తారని స్పష్టం చేశారు. అయితే చైనా విదేశాంగ మంత్రి చేసిన వ్యాఖ్యలపై అమెరికా గానీ, యాపిల్ కంపెనీ ( Apple company ) గానీ అధికారికంగా స్పందించాల్సి ఉంది. చైనాలో వీక్సిన్ గా పిలుచుకునే వీ చాట్ కు 1.2 బిలియన్ల యాక్టివ్ యూజర్లున్నారు.  2020 రెండో త్రైమాసికంలో చైనా స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో యాపిల్ సంస్థ 8 శాతం వాటా కలిగి ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో వీ చాట్ వర్సెస్ యాపిల్ ఫోన్ వివాదం పెరిగి పెద్దదై..బీజింగ్- వాషింగ్టన్ ల మద్య యుద్ధ వాతావరణాన్ని పెంచేస్తోంది. Also read: Facebook news: శుభవార్త: త్వరలో ఇండియాలో ప్రారంభం

 

Trending News