Eagle vs Snake Fight: గద్దపై ప్రతికారంతో విరుచుకుపడిన చిన్న పాము - వీడియో వైరల్

Eagle vs Snake Fight: పాములపై ఎప్పుడూ ఆకాశంలో ఎగిరే ప్రమాదకరమైన పక్షి విజయం సాధిస్తుందని అందరికీ తెలిసిన విషయమే. కానీ, ఇప్పుడు అంతటి ప్రమాదకరమైన గద్దను ఓ చిన్న పాము మట్టికరిపించింది. దానిపై దాడి చేయడానికి వచ్చిన గద్దను ఏకంగా చంపేందుకు కూడా వెనుకాడలేదు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 24, 2022, 01:19 PM IST
Eagle vs Snake Fight: గద్దపై ప్రతికారంతో విరుచుకుపడిన చిన్న పాము - వీడియో వైరల్

Eagle vs Snake Fight: జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ వెబ్ సైట్లలో తరచూ వైరల్ గా మారుతుంటాయి. జంతువులకు సంబంధించిన ఫన్నీ వీడియోలు నుంచి ఒళ్లు గగుర్పొడిచే షాకింగ్ వీడియోల వరకు ఎన్నో నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఆకాశంలో ఎగిరే అత్యతం ప్రమాదకరమైన పక్షిగా గద్దగా పరిగణిస్తారు. గద్ద వేటాడే సమయంలో తన కాలి గోర్లతో ఎంతటి జంతువునైనా చీల్చి చెండాడుతుంది. దాని పట్టు నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. కానీ, ఆకాశంలో ఎగిరే అంతటి శక్తివంతమైన గద్దను నెలపై తిరిగే ఓ చిన్న పాము మట్టికరిపించింది. గద్దను చుట్టేసి చావు అంచులదాకా తీసుకెళ్లింది. 

ఏం జరిగిందంటే?

ఆకాశంలో ఎగిరే గద్దలు ఎంత పెద్ద పామునైనా వేటాడే శక్తిని కలిగి ఉంటాయి. కానీ, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. సాధారణంగా పాములపై ప్రతిసారి విజయం సాధించే గద్ద.. ఇప్పుడు ఓ చిన్న పాము చేతిలో చిక్కి.. చావు అంచుల దాకా వెళ్లింది. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. 

ఇంటర్నెట్ లో ట్రెండ్ అవుతున్న వీడియో ప్రకారం.. గద్దను ఓ చిన్న పాము చుట్టేసింది. గద్ద కాలుపై కాటు వేసి.. అది కదలకుండా చుట్టేసింది. అటుగా వెళ్లిన ఓ వ్యక్తి గద్దను కాపాడేందుకు ప్రయత్నించాడు. పాము, గద్దలను విడదీసేందుకు ప్రయత్నిస్తూ.. పామును పక్కకు లాగాడు. అయితే చిన్న పాము.. గద్ద కాలును గట్టిగా పట్టుకొని ఎంతకీ వదలడం లేదు.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by طبیعت (@nature27_12)

దీంతో ఆ వ్యక్తి పామును పక్కకు తీసేందుకు చేసిన అనేక ప్రయత్నాల తర్వాత గద్దను విడిచిపెట్టింది. దాంతో బతుకుజీవుడా అంటూ గద్ద అక్కడి నుంచి ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతుంది. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగిందనే విషయం తెలియరాలేదు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. 

Also Read: viral video: ఏనుగు, అడవి దున్న ఫైట్ చేసుకుంటాయనుకుంటే... సీన్ రివర్స్ అయింది..

Also Read: Lucky Lottery Ticket: లవర్స్ డే రోజు లాటరీ టికెట్ గిఫ్ట్ ఇచ్చిన భర్త.. కోపడ్డ భార్య.. కట్ చేస్తే రూ. 10 కోట్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News