Viral Video: ఎగిరెగిరి బుసలు కొడుతున్న కింగ్ కోబ్రాకే చుక్కలు చూపించిన తల్లి కోడి... వీడియో చూస్తే గూస్ బంప్స్ ఖాయం

Video of Mother Hen Fight with King Cobra: కోడి పిల్లలను తినేందుకు వచ్చిన ఓ కింగ్ కోబ్రాకు తల్లి కోడి చుక్కలు చూపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Written by - Srinivas Mittapalli | Last Updated : Sep 4, 2022, 02:36 PM IST
  • కింగ్ కోబ్రాకు చుక్కలు చూపించిన తల్లి కోడి
  • కోడి పిల్లల కోసం కింగ్ కోబ్రాతో ఫైట్
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
Viral Video: ఎగిరెగిరి బుసలు కొడుతున్న కింగ్ కోబ్రాకే చుక్కలు చూపించిన తల్లి కోడి... వీడియో చూస్తే గూస్ బంప్స్ ఖాయం

Video of Mother Hen Fight with King Cobra: కింగ్ కోబ్రా అంటేనే చాలా విషపూరితమైనది. కింగ్ కోబ్రా కాటు వేసిందంటే 15-20 నిమిషాల్లో మరణం సంభవిస్తుంది. కింగ్ కోబ్రా ఒక్క కాటులో ఉండే విషం 20 మందిని లేదా ఏడు ఏనుగులను చంపగలదు. ఇండియాతో పాటు దక్షిణాసియా దేశాల్లో కింగ్ కోబ్రాల సంచారం ఎక్కువగా ఉంటుంది. తాజాగా ఓ కింగ్ కోబ్రా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ఓ కోడి తన పిల్లలను కింగ్ కోబ్రా బారి నుంచి ఎలా రక్షించుకుందో మీరే చూడండి..

ఆ వీడియోని గమనిస్తే.. ఒక తల్లి కోడి తన పిల్లలతో కలిసి ఒక గది మూలన ఉంది. ఇంతలో ఆ చిన్న గదిలోకి భయంకర విషసర్పం కింగ్ కోబ్రా చొరబడింది. జరజరా పాకుతూ ఆ కోళ్ల వద్దకు చేరింది. అది తన పిల్లలను తినేందుకే వస్తోందని గ్రహించిన తల్లి కోడి కింగ్ కోబ్రాతో పెద్ద యుద్ధమే చేసింది. కింగ్ కోబ్రా ఎగిరెగిరి బుసలు కొడుతున్నప్పటికీ ఏమాత్రం భయపడకుండా గట్టిగా ప్రతిఘటించింది.

ఒక్క కోడి పిల్ల కూడా కింగ్ కోబ్రా బారిన పడకుండా తల్లి కోడి వాటిని రక్షించుకుంది. ఒక్కొక్క కోడి పిల్లను అక్కడి నుంచి బయటకు తప్పించింది. చివరకు ఒక్క కోడి పిల్ల మాత్రం కింగ్ కోబ్రాకు సమీపంలో మూలన ఒదిగిపోయింది. ఆ కోడి పిల్లను కూడా తల్లి కోడి రక్షించే ఉంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పక్షులైనా, జంతువులైనా, మనుషులైనా తల్లి ప్రేమకు ఏది సాటి రాదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోకి ఇప్పటివరకూ 30 మిలియన్ల వ్యూస్, దాదాపు 9 వేల పైచిలుకు కామెంట్స్ వచ్చాయి. 

Also Read: Deverakonda Returns Remuneration: విజయ్ దేవరకొండ ఛార్మీకి ఆ డబ్బు తిరిగిచ్చేశాడా ?

Also Read: Healthy Relationships: మంచి రిలేషన్‌షిప్‌ ఎలా ఉండాలి.. ఆ 4 విషయాల్లో 'రాజీ' అనేదే ఉండొద్దట..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News