cobra snake attacks on cat kitten video viral: సాధారణంగా కాకి పిల్లలు కాకికి ముద్దని చెబుతుంటారు. అంటే ఈ సృష్టిలో.. తన సంతానం తల్లిదండ్రులకు ఎంతో ముద్దుగా ఉంటుందని చెప్తుంటారు. మనిషుల నుంచి నోరు లేని జీవాల వరకు కూడా.. తనపిల్లలను ఎవరైన గెలికితే.. దాడులు చేసేందుకు సైతం వెనుకాడవు. అంతేకాకుండా.. తన కంటే రెట్టింపు శక్తి ఉన్న జీవులతో సైతం ఫైటింగ్ కు దిగిపోతుంటాయి. అడవిలో మనం తరచుగా కొన్నిజంతువుల్ని చూస్తుంటాం.
Mom Cat saves her kittens from cobra attack pic.twitter.com/E33qa73vOW
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) August 24, 2024
ముఖ్యంగా వేటాడే జంతువులు.. చిన్న జంతువుల్ని, టార్గెట్ చేసుకుంటాయి. అంతే కాకుండా.. తల్లి జీవి పక్కన లేనప్పుడు లేదా దూరంగా ఉన్నప్పుడు పిల్లజీవులపై దాడులు చేస్తుంటాయి. ఈ క్రమంలో తల్లి జంతువులు... తమ పిల్ల జీవులపై దాడిచేసిన జంతువులకు చుక్కలు చూపిస్తుంటాయి. కొన్నిసార్లు దాడులు చేసి చంపేస్తుంటాయి. ఈ క్రమంలో ఒక తల్లి.. తన పిల్లల జోలికి వచ్చిన భయానక సర్పంను ఎదిరించింది. ఈ వీడియోప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పూర్తి వివరాలు..
ఒక పిల్లి తన పిల్లలతో కలిసి ఒక పెట్టెలో కూర్చున్నాయి. సాధారణంగా పిల్లి తన పిల్లల్ని పుట్టాక అనేక ఇళ్లకు తిప్పుతుంటుంది. ఈ క్రమంలో పాపం... పిల్లికి అనుకోని ఘటన ఎదురైంది. పిల్లి తన పిల్లలతో ఉండగా.. ఒక్కసారిగా పాము దానివైపుగా వచ్చింది. పాపం.. పిల్ల తన పిల్లల్ని కాపాడుకునేందుకు తెగ ప్రయత్నాలు చేసింది. నల్ల పాముతో పోరాడింది. అది బుసలు కొడుతున్న.. తన పిల్లలను కాపాడుకోవాలని తెగ తాపత్రయపడింది.
చివరకు పాము.. బుసలు కొట్టి.. కొట్టి.. అక్కడి నుంచి వెళ్లిపొయింది. పిల్లి మాత్రం తన పిల్లలు ప్రాణాలతో బైటపడినందకు ఊపిరిపీల్చుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు వామ్మో.. పిల్లికి డెరింగ్ కు శభాష్ చెప్పాల్సిందేనంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం.. పిల్లి దెబ్బకు తోక ముడిచిన పాము అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook