Snake Catchers Holding Up Huge King Cobra: ప్రపంచంలో అతి ప్రమాదకరమైన పాము జాతుల్లో కింగ్ కోబ్రా ఒకటి. ఇది చూడడానికి పది అడుగుల ఆకారాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది విభిన్న రంగులను కలిగి ఉంటుంది. ఎక్కువగా భారీ కింగ్ కోబ్రాలు అమెజాన్ అడవుల్లో కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఆకలిని తీర్చుకునేందుకు జంతువులను సైతం వేటాడుతాయి. అందుకే చాలామంది వీటికి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు.
ప్రస్తుతం భారత్లో అడవి సరిహద్దు గ్రామాల్లో కింగ్ కోబ్రాలు సంచారం చేస్తూ ఉంటాయి. వీటిని గ్రామస్తుల నుంచి రక్షించేందుకు స్నేక్ క్యాచర్స్ ప్రాణాలను పణంగా పెట్టి వాటిని పట్టుకొని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే ఇదే క్రమంలో స్నేక్ క్యాచర్స్ వీడియోలను తీసి యూట్యూబ్ లో షేర్ చేస్తున్నారు. ఈ కోబ్రాలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ గా మారుతున్నాయి. అంతేకాకుండా నెటిజన్లు వీటిని చూసేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు.
ఇటీవలే స్నేక్ క్యాచర్స్ ఆకాష్ జాదవ్ యూట్యూబ్లో షేర్ చేసిన వీడియో తెగ సర్కులేట్ అవుతోంది. ఈ వీడియోని చూసి నటిజన్లు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇక ఈ వీడియో విషయానికొస్తే.. అడవికి సరిహద్దు ప్రాంతంలో ఉండే ఒక గ్రామంలో భారీ కింగ్ కోబ్రా సంచారం చేస్తోంది. దీనిని గమనించిన అక్కడి గ్రామస్తులు ప్రముఖ స్నేక్ క్యాచర్స్ ఆకాష్ జాదవ్ కు సమాచారం అందించారు. ఈ సమాచారం మేరకు హుటాహుటిన ఆయన బృందంతో అక్కడికి చేరుకొని.. పాము కోసం గాలింపు చర్యలు చేపట్టాడు.
Also Read: Mars transit 2023: జూలై 01 వరకు ఈ 3 రాశులకు డబ్బే డబ్బు.. ఇందులో మీరున్నారా?
ఇలా గాలింపు చర్యలు చేపట్టే క్రమంలో ఒక పాడుబడ్డ గుడిసెలో.. కట్టెల కింద భారీ కింగ్ కోబ్రా కనిపిస్తుంది. దీంతో ఆకాష్ జాదవ్ నెమ్మదిగా.. దానిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తాడు. ఇలా ప్రయత్నించే క్రమంలో ఆ భారీ కింగ్ కోబ్రా అతని కాటేసే ప్రయత్నం చేస్తుంది. అయినప్పటికీ క్షణాల్లో ఆ పాము కాటు నుంచి తప్పించుకొని.. పామును సురక్షితంగా బయటకు తీసుకొస్తాడు.
భారీ కింగ్ కోబ్రా ను అక్కడి స్థానికులకు చూపించేందుకు కింగ్ కోబ్రాను పట్టుకొని పైనకెత్తుతాడు. ఇలా పైకెత్తే క్రమంలో కూడా కోబ్రా అతన్ని కాటేసే ప్రయత్నం చేస్తుంది. అయినప్పటికీ కాటు నుంచి తప్పించుకుంటాడు. ఆ చివరకు భారీ కోబ్రాను ఓ కాటన్ సంచిలో బంధించి అడవిలోని సురక్షిత ప్రాంతంలో విడిచిపెడతాడు. ఈ వైరల్ అవుతున్న వీడియోను సర్ప్ మిత్ర ఆకాష్ జాదవ్ అనే ఛానల్ యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోను 4 లక్షలకు పైగా నేటిజన్లు వీక్షించారు.
Also Read: Mars transit 2023: జూలై 01 వరకు ఈ 3 రాశులకు డబ్బే డబ్బు.. ఇందులో మీరున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook