Dirty Money: నాలాలో నోట్ల వరద...ముక్కుమూసుకుని తీసుకుంటున్న స్థానికులు

మురికి కాలువలో నోట్లు కొట్టుకుపోతున్నాయి.. అప్పుడు మీరేం చేస్తారు ? తీసుకుంటారా.. లేక డర్టీ మనీ అని వదిలేస్తారా ? ఆలోచించండి. 

Last Updated : Aug 23, 2020, 05:54 PM IST
    • మురికి కాలువలో నోట్లు కొట్టుకుపోతున్నాయి..
    • అప్పుడు మీరేం చేస్తారు ? తీసుకుంటారా.. లేక డర్టీ మనీ అని వదిలేస్తారా ? ఆలోచించండి.
    • కానీ బంగ్లాదేశ్ నగరం అయిన రాజ్ షాహీలో మాత్రం డబ్బు కోసం మురికి కాలువలో దిగుతున్నారు అక్కడి ప్రజలు.
    • వారికి వేలకు వేలు దొరుకుతున్నాయి.
    Dirty Money: నాలాలో నోట్ల వరద...ముక్కుమూసుకుని తీసుకుంటున్న స్థానికులు

    మురికి కాలువలో నోట్లు కొట్టుకుపోతున్నాయి.. అప్పుడు మీరేం చేస్తారు ? తీసుకుంటారా.. లేక డర్టీ మనీ అని వదిలేస్తారా ? ఆలోచించండి. కానీ బంగ్లాదేశ్ నగరం అయిన రాజ్ షాహీలో మాత్రం డబ్బు కోసం మురికి కాలువలో దిగుతున్నారు అక్కడి ప్రజలు. వారికి వేలకు వేలు దొరుకుతున్నాయి.

    బంగ్లాదేశ్ లోని ( Bangladesh ) రాజ్ షాహీలో ఒక ఆసుపత్రి ముందు ఒక మురికి కాలువ ఉంది. అక్కడి నుంచి వెళ్తున్న ఒక వ్యక్తి ఎందుకోగానీ సడెన్ గా మురికి కాలువ వైపు చూశాడు. ఐదు వందల నోటు ( Currency Note ) కనిపించింది. వెంటనే దిగి తీసుకున్నాడు. ఎంతకైనా మంచిది అని అరగంట ఆగి చూస్తే మరో ఐదు వందల రూపాయల నోటు.. ఈ సారి బోనస్ గా మరో వంద రూపాయల నోటు.. కనిపించగానే తీసుకున్నాడు. ఇక మూడు నాలుగు రోజుల నుంచి ఆ నాలా దగ్గరే కూర్చుని నోటు కనిపించినప్పుడల్లా దిగి తీసుకోవడం అలవాటుగా మార్చుకున్నాడు. Read Also: Rhea and Jiah: జియా ఖాన్ తో మహేష్ భట్ వీడియో వైరల్

    ఇలా కొన్ని వేల రూపాయలు సేకరించాడు. ఈ వార్త ఎలా లీకైందో తెలియదు కాని తెగ వైరల్ అయింది ( Viral ) చుట్టు పక్కల వాళ్లే కాదు.. వేరే జిల్లాల నుంచి కూడా ప్రజలు వచ్చి నాలాలో దిగి నోట్ల కోసం వేచి చూస్తున్నారు. ఎంత మంది వచ్చినా అందరికీ నోట్లు దొరకడం ఇక్కడ విశేషం. ఇలా చాలా మంది వేలకు వేలు తీసుకెళ్తున్నారట. అయితే ఈ డబ్బు ఎక్కడిది అనే సందేహం మీకు రావచ్చు.

    ఇవి కూడా చదవండి

    దీనికి కరెక్ట్ సమాధానం తెలియదు కానీ.. రాజ్ షాహీ నగర  రోడ్ ట్రాన్స్ పోర్టుకు చెందిన కొన్ని డాక్యుమెంట్స్ కూడా డబ్బుతో పాటు కొట్టుకొచ్చాయట. ఆరా తీయగా ఒక అధికారి దీని గురించి మాట్లాడాడు. ఈ డాక్యుమెంట్స్ సుమారు ఏడు సంవత్సరాల క్రితం నాటివి. చెత్త ఎక్కువ అవడంతో కాల్చమంటే సిబ్బంది ఇలా పడేసి ఉంటారు అన్నారు. 

    మరి నోట్ల సంగతి ఏంటంటే... కొన్ని నెలల క్రితం ట్రాన్స్ పోర్టు డిపార్ట్ మెంట్ లో పని చేసే ఉద్యోగి ఒక ట్రావెల్స్ కంపెనీ నుంచి రూ.2 లక్షల 50 వేలు తీసుకున్నాడట.  ఆ డబ్బు గురించి అధికారులకు తెలియడంతో వెంటనే ప్రశ్నించాటరట.

    సదరు ఉద్యోగి ఆఫీసుకు వచ్చేటప్పుడు.. వెళ్లేటప్పుడు రోజూ బ్యాగ్ చెక్ చేసే వారట. కానీ డబ్బు లభించలేదు. బహుషా ఆ డబ్బును ఇలా పాత కాగితాల్లో దాచి పెట్టి ఉండవచ్చు. వాటి గురించి తెలియక సిబ్బంది పాత కాగితాలను..నోట్ల కట్టలను ఇలా నాలాలో పాడేసి ఉండవచ్చు అంటున్నారు.

    Trending News