Viral Snake Video: సాధారణంగా పాములు గుడ్లు పెట్టడం ద్వారా సంతానోత్పత్తి జరుపుతాయనే విషయం అందరికీ తెలిసిందే. అయితే అన్ని పాములకు ఇది వర్తించదు. కొన్ని పాములు శరీరంలో నిక్షిప్తమైన గుడ్ల నుంచి నేరుగా పిల్లలకు జన్మనిస్తాయి. అలాంటిదే ఓ పాము వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో లైవ్ కెమెరా ముందు ఆకుపచ్చ రంగులో ఉన్న ఓ పాము.. పిల్ల పాముకు జన్మనివ్వడం గమనించవచ్చు. ఈ వీడియో చూసి చాలామంది నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. పాములు ఇలా కూడా పిల్లలకు జన్మనిస్తాయా అని కామెంట్స్ చేస్తున్నారు. వీడియోలో (Snake Video) ఆకుపచ్చ రంగు పాము ఓ కర్రను చుట్టుకుని ఉండగా.. దాని కడుపులో నుంచి ఎరుపు రంగులో ఉన్న పిల్ల పాము బయటకు రావడం గమనించవచ్చు.
We all thought snakes reproduce by laying eggs…
Not all.Some produce young by hatching of eggs stored inside the body of the https://t.co/VSmSrTMOHj this one from Brazil.
(From SM) pic.twitter.com/TdQdvWC1x4— Susanta Nanda IFS (@susantananda3) December 30, 2021
సుశాంత నంద అనే ఐఎఫ్ఎస్ అధికారి ఈ వీడియోని తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. 'పాములు గుడ్లు పెట్టడం ద్వారా సంతానోత్పత్తి జరుపుతాయని మనమంతా అనుకుంటాం. కానీ అన్ని పాములు అలా కాదు. కొన్ని పాములు శరీరంలో నిక్షిప్తమైన గుడ్ల ద్వారా ఇలా పిల్లలకు జన్మనిస్తాయి. ఇదిగో ఈ బ్రెజిల్ పాములా...' అని ఆ వీడియోకి తన కామెంట్‌ను జత చేశారు.
'నిజంగా ఆశ్చర్యంగా ఉంది... పాములు ఇలా కూడా జన్మనిస్తాయనే విషయం అసలు తెలియదు..' అంటూ వీడియోపై కొందరు నెటిజన్లు కామెంట్ చేశారు. 'గ్రేట్.. ప్రకృతి ఎప్పటికీ ప్రత్యేకమైనదే... ఎప్పుడూ ఏదో కొత్త విషయం చెబుతూనే ఉంటుంది.' అని మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేశారు. ఈ వీడియోకి ఇప్పటివరకూ 1682 లైక్స్ రాగా... 20 వేల పైచిలుకు మంది వీక్షించారు. వీడియో (Viral Video) ఒరిజినల్ సోర్స్‌లో దాదాపు 78.5 వేల మంది నెటిజన్లు దీన్ని వీక్షించారు.
Also Read: New Year Cake 2022: న్యూఇయర్ కోసం ఇంట్లోనే మ్యాంగో చీజ్ కేక్ తయారీ ఎలానో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి