Daughter Whatsapp Chat: మీరు ఎప్పుడైనా ఏదైనా హాస్టల్‌లో ఉన్నారా..? అక్కడ ఫుడ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇంటి భోజనానికి.. హాస్టల్ భోజనానికి అసలు పోలీకే ఉండదు. హాస్టల్ భోజనంతో విసుగు చెంది చాలామంది బయట తినేందుకు ఇష్టపడుతున్నారు. రూమ్‌లలో ఉండి సరిగా వండుకోలేక.. హాస్టల్ ఫుడ్ సరిగా తినలేక చాలామంది ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ఇలా హాస్టలో భోజనం తినలేక విసుగుచెందిన ఓ యువతి.. ఇంటికి వెళుతూ వాట్సాప్ ఫ్యామిలీలో పెట్టిన మెసేజ్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. చాట్ స్క్రీన్ షాట్ చూసి నెటిజన్లు కూడా తమ హాస్టల్ ఫుడ్ రోజులు గుర్తు చేసుకుంటున్నారు.
హాస్టల్ నుంచి మనం ఇంటికి వెళ్లగానే.. అమ్మ ఇష్టమైన వంటకాలు చేసి పెడుతుంది. మనం ఏది అడిగినా కాదనకుండా వండి పెడుతుంది. ఇలా తనకు ఇష్టమైన ఆహారం తినాలనుకున్న ఓ యువతి ముందుగానే తనకు కావాల్సిన వంటకాల లిస్టు రెడీ చేసుకుంది. హాస్టల్ నుంచి ఇంటికి వెళుతూ ఫుడ్ మెనూను తమ వాట్సాప్ ఫ్యామిలీ గ్రూప్‌లో పోస్ట్ చేసింది. తనకు స్టాటర్, మెయిన్ కోర్సు, సప్లిమెంటరీగా ఎలాంటి ఫుడ్ కావాలో కూడా గ్రూప్‌లో పెట్టింది.
ఫిష్ టిక్కా, కబాబ్‌లు, బిర్యానీ,న్యూటెల్లా చీజ్‌కేక్ వంటి వాటిని యువతి ఫుడ్ మెనూలో యాడ్ చేసింది. 'నా కూతురు 5 నెలల తర్వాత 16వ తేదీ సాయంత్రం ఇంటికి వస్తోంది. హాస్టల్‌లో ఫుడ్ సరిగా ఉండకపోవడంతో పిల్లలు ఆకలితో అలమటిస్తారు' అంటూ యువతి తండ్రి ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుండగా.. నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.
Daughter is coming home on 16th evening after 5 months. Hostel (and hers is a vaishnav one) really makes kids bhukkad-Bhikhari!
🤦🏽♂️🤦🏽♂️ pic.twitter.com/JOVRCYWX0Y— Shwetank (@shwetankbhushan) December 11, 2022
'ఇంటికి వెళ్లే ముందు నా జాబితాను పంపమని మా నాన్న ఇప్పటికీ నన్ను అడుగుతారు. నేను ఇంటికి వెళ్లే సమయానికి ఇంట్లో అన్ని సిద్ధంగా ఉంటాయి. తండ్రులు నిజంగా ఉత్తములు. మా నాన్న నాకు ఇష్టమైన వంటకాలు అన్ని చేస్తాడు..' అని ఓ యువతి గుర్తుచేసుకుంది. మరికొందరు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
'నా కుమార్తెకు పెళ్లై 8 సంవత్సరాల కొడుకు ఉన్నాడు. అయినా ఆమె పూర్తిగా వంట చేయలేకపోతుంది. ఇప్పటికీ నాకు చాలా పెద్ద జాబితాలను పంపుతుంది. ఆమె భర్త, కొడుకు ఫుడ్ కోరికల జాబితా యాడ్ చేసి పంపిస్తోంది..' అంటూ ఓ మహిళ సరదాగా రిప్లై ఇచ్చింది.
Also Read: APSRTC: ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త.. బస్టాండ్లలో ఫ్రీ ఇంటర్నెట్
Also Read: 7th Pay Commission: న్యూ ఇయర్ గిఫ్ట్‌గా డీఏ ప్రకటన.. ఎంత పెరగనుందంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.