Bhogi Festival 2023: తెలుగు లోగిళ్లలో సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు నెల రోజుల ముందు నుంచే సందడి మెుదలవుతుంది. ముఖ్యంగా ఏపీలో అయితే ఈ ఫెస్టివల్ హడావుడి మాములుగా ఉండదు. హరిదాసు కీర్తనలు, ముగ్గులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దు విన్యాసాలు, కోడి పందాలు, కొత్త అల్లుళ్లు రాకతో ఈ పెద్ద పండుగ సరికొత్త శోభను సంతరించుకుంటుంది. మూడు రోజులపాటు జరిగే ఈ పండుగ తెలుగు వారి సంస్కృతికి అద్దంపడుతుంది. ఈ ఫెస్టివల్ తొలి రోజునే మనం భోగి పండుగల జరుపుకుంటాం. 2023లో ఈ పండుగను జనవరి 14న జరుపుకోనున్నారు.
భోగి పండుగ ప్రాముఖ్యత
'భగ' అనే పదం నుంచి 'భోగి' అనే మాట వచ్చిందంటారు పెద్దలు. దక్షిణాయనానికి అఖరి రోజుగా భోగి పండుగను భావిస్తారు. ఎందుకంటే దక్షిణాయనంలో పడ్డ కష్టాలు, బాధలను భోగి మంటల (bonfire) రూపంలో అగ్ని దేవుడికి సమర్పించి.. రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖసంతోషాలను ప్రసాదించాలని ప్రజలు కోరుకుంటారు.
భోగి రోజున తెల్లవారుజామున లేచి స్నానం చేసి శుభమైన బట్టలు ధరిస్తారు. అనంతరం భోగి మంటలు వేస్తారు. ఈ మంటల్లో పిడకలు, ఇంట్లోని పాత వస్తువులు, పాత బట్టలను అగ్నికి అహుతి చేస్తారు. మనలోని చెడును తగలబెట్టి, మంచిని పెంచుకోవడమే ఈ భోగిమంటల యెుక్క ముఖ్య ఉద్దేశ్యం. భోగి రోజు బొమ్మల కొలువు చేసి... చిన్న పిల్లల మీద రేగుపళ్లు పోస్తారు. ఈ పళ్లు సూర్యభగవానుడి ఎంతో ప్రీతిపాత్రమైన పళ్లు. ఈ పండ్లను పోయడం వల్ల పిల్లల తలపై ఉండే బ్రహ్మ రంధ్రం ప్రేరేపితమై పిల్లలలు జ్ఞానవంతులు అవుతారని నమ్ముతారు.
Also Read: Shani Gochar 2023: కుంభంలోకి శనిదేవుడు.. కొత్త ఏడాదిలో ఈ 4 రాశులవారు ధనవంతులవ్వడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.