These 5 Things to do on Akshaya Tritiya instead of buying gold: హిందూ గ్రంధాల ప్రకారం.. వైశాఖ మాసం శుక్ల పక్షం మూడవ రోజున 'అక్షయ తృతీయ' జరుపుకుంటారు. దీనిని 'అఖా తీజ్' అని కూడా పిలుస్తారు. భారతదేశంలో ప్రజలు ఈసారి మంగళవారం (మే 3)న అక్షయ తృతీయను జరుపుకుంటున్నారు. హిందూ మతంలో ఈరోజుకి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. అక్షయ తృతీయ రోజున ప్రతిఒక్కరు విష్ణుమూర్తిని, లక్ష్మీ దేవిని పూజిస్తారు. ఈ రోజున విష్ణువును చందనంతో అభిషేకిస్తారు. ఇలా చేయడం వల్ల జీవితంలో ఆనందం, సంపద వస్తుందని భక్తులు విశ్వసిస్తారు.
అక్షయ తృతీయ రోజున విష్ణుమూర్తితో సహా లక్ష్మీ దేవి మరియు గణేశుడిని పూజిస్తారు. ఇలా చేయడం ద్వారా కుటుంబానికి శ్రేయస్సు లభిస్తుంది నమ్ముతారు. అక్షయ తృతీయ పూజకు నేడు అనుకూలమైన సమయం ఉదయం 5:39 నుంచి మధ్యాహ్నం 12.18 వరకు ఉంది. ఇక అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే అంతా శుభమే అని ప్రజల నమ్మకం. ఇంట్లో లక్ష్మీ దేవి రాకను సూచిస్తుందని, లక్ష్మీ దేవి అనుగ్రహం ఇంట్లో ఉంటుందని నమ్ముతారు. అందుకే ఈరోజు బంగారం కొనేందుకు అందరూ ఆసక్తిచూపిస్తారు.
అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే లక్ష్మీ దేవి అనుగ్రహం ఇంట్లో ఉంటుందని నమ్ముతారు. అయితే బంగారం కొనుగోలు చేయడానికి బదులుగా అవసరం ఉన్నవారికి సాయం చేసినా దేవుడి ఆశీస్సులు మనపై ఉంటాయట. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశంలోని ప్రతిఒక్కరు భిన్న అనుభవాలను ఎదుర్కొన్నారు. కరోనా కారణంగా ఎందరో పెదలు రోడ్డున పడ్డారు. అందుకే ఈ సంవత్సరం అక్షయ తృతీయ నాడు బంగారాన్ని కొనుగోలు చేయడానికి బదులుగా.. అవసరమైన వారికి సహాయం చేయడం మంచిదట.
అక్షయ తృతీయ నాడు చేయాల్సిన పనులు:
# అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేసేందుకు మీరు అనుకున్న బడ్జెట్‌ను కోవిడ్ రిలీఫ్ సంస్థలకు ఇవ్వండి.
# అక్షయ తృతీయ నాడు ఆపదలో ఉన్నవారికి మీ వంతుగా ఆదుకోండి.
# నేడు బంగారం కొనడానికి బయటికి వెళ్లడం కంటే.. ఇంట్లో గడపండి. దాంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది.
# ఈరోజు ఇంటిని శుభ్రపరుచుకుని లక్ష్మీ పూజ చేయండి. దాంతో లక్ష్మీ దేవి అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది.
# పేదలకు అన్నదానం చేయండి.
Also Read: IPL 2022 Umpiring: క్యాచ్ అయితే వైడ్ ఇచ్చాడు.. అతడికి ఉత్తమ అంపైరింగ్ అవార్డు ఇవ్వండి!
Also Read: Sai Pallavi Marriage: సినిమాలు చేయకపోతే.. పెళ్లి చేసేస్తారా! ఆ వార్తలు ఎంత బాధిస్తాయో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook