Ashadha Amavasya 2022: హిందూవులకు ఆషాఢ అమావాస్య అత్యంత ప్రాధాన్యత కలిగింది. ఆషాఢ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఆషాఢ అమావాస్య ఎప్పుడొస్తుంది. ప్రాముఖ్యత, విధి విధానాలేంటనేది తెలుసుకుందాం..
ఈ ఏడాది అంటే 2022 ఆషాఢ అమావాస్య జూన్ 29న ఉంది. అంటే రేపే. ఆషాఢమాసంలోని కృష్ణపక్షంలో వస్తుంది. హిందూ పంచాంగంలో ఆషాఢమాసం నాలుగవనెల. ఆషాఢ అమావాస్య తిధి జూన్ 28వ తేదీ మంగళవారం ఉదయం 5 గంటల 52 నిమిషాలకు ప్రారంభమై..జూన్ 29వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల 21 నిమిషాలవరకూ ఉంటుంది.
ప్రాముఖ్యత
హిందూ పురాణాల ప్రకారం ఆషాఢ అమావాస్య నాడు పితృ తర్పణం, పిండదానం కార్యక్రమాలు నిర్వహిస్తారు. హిందూవులకు ఈ రోజు అత్యంత పవిత్రమైనది. ఈరోజు పవిత్ర నదుల్లో పుణ్యస్నానమాచరిస్తారు. పూర్వీకుల శాంతి కోసం వివిధ రకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తారు. పూర్వీకులు జనన మరణ చట్రం నుంచి విముక్తి పొందుతారని భావిస్తారు.
ఆషాఢ అమావాస్య 2022 విధి విధానాలు
భక్తులు గంగా వంటి పవిత్ర నదుల్లో తప్పకుండా పుణ్యస్నాం చేయాలి. పండితులు లేదా పూజారులకు ఫూర్వీకుల శాంతి కోసం భోజనం పెట్టాలి. నిష్ణాతులైన పండితులతో పూర్వీకుల శాంతి కోసం పూజలు చేయించాలి. దాన ధర్మాలు చేయాలి. అన్నదానం, బట్టలు పంచిపెట్టడం చేస్తే చాలా మంచిదని భావిస్తారు. తమ జాతకంలో పితృదోషమున్నవారు. తప్పకుండా గుడికి వెళ్లి.. రావిచెట్టు కింద ఆముదం నూనెతో దీపాన్ని వెలిగించాలి.
అమావాస్య నాడు ఏం చేయకూడదు
ఆాషాఢమాసం అమావాస్య నాడు బట్టలు, చెప్పులు కొనుగోలు చేయకూడదు. బంగారం, వెండి ఆభరణాలు కొనకూడదు. కొత్త ఉద్యోగం లేదా కొత్త వ్యాపారం ప్రారంభించకూడదు. కొత్త వాహనాలు కొనుగోలు చేయడం మంచిది కాదు. పెళ్ళిళ్లు వంటి శుభకార్యాలకు ఈరోజు దూరంగా ఉండాలి.
Also read: Rahuvu transit 2022: రాహు మేషరాశిలో ప్రవేశం, ఆ మూడు రాశులకు ఏడాది వరకూ అంతులేని సంపదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.