Astro Tips for Money: మందార పువ్వులు ఎరుపు రంగులో పెద్దవిగా ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ పువ్వులను అలంకరణ, దేవుడి పూజలో మాత్రమే కాకుండా ఔషదాలలో కూడా ఉపయోగిస్తారు. అయితే మందార పువ్వులను ఎక్కువగా జట్టు రాలకుండా ఉండటానికి, శిరోజాలు ఒత్తిగా పెరగడానికి ఉపయోగిస్తారు. మందార పువ్వులలో చాలా రకాలు ఉన్నాయి. అయితే మన ఇండియాలో మాత్రం ఎరుపు రంగు పుష్పాలనే ఎక్కువగా వాడతాం. మందార అనేక రకాల వ్యాధులను కూడా దూరం చేస్తుంది. అయితే ఈ మందార డబ్బును కూడా తెస్తుందని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది. మందార చెట్టు ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.
మందార పువ్వును (Hibiscus Flower) లక్ష్మీదేవికి సమర్పిస్తే... మీ పేదరికం తొలగిపోతుంది. శుక్రవారం నాడు మీ ఇంటికి దగ్గరలోని అమ్మవారి ఆలయానికి వెళ్లి ఎరుపు రంగు మందార పుష్పాన్ని సమర్పిస్తే మీ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. దీంతోపాటు తల్లికి పంచదార, మిఠాయి, పాలతో చేసిన బర్ఫీను నైవేద్యంగా పెట్టి..పూజలు చేయండి. ఇలా కనీసం 11 శుక్రవారాలు చేస్తే... మీరు ఊహించినంత డబ్బు మీ వద్దకు వస్తుంది. అంతేకాకుండా జీవితంలో దేనికీ లోటు ఉండదు.
మందార పువ్వు ఇతర ప్రయోజనాలు..
>> సూర్యుడికి ఉదయాన్నే అర్ఘ్యం ఇచ్చేటప్పుడు ఆ నీళ్లలో మందార పువ్వును వేస్తే మీకు ఆ దేవుడి అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా కొద్ది రోజుల్లో మీ లైఫ్ చేంజ్ అవుతుంది.
>> మీ జాతకంలో సూర్యదోషం ఉన్నట్లయితే ఎర్ర మందార మొక్కను ఇంటికి తూర్పు దిక్కున నాటితే మీ దోషం పోతుంది.
>> మందార మెుక్కను ఇంట్లో ఉంచితే నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది.
>> మీ పిల్లలకు చదువుకోవాలని అనిపించకపోతే, మీరు అతని స్టడీ టేబుల్‌పై ఎర్రటి మందార పువ్వును ఉంచండి.
Also Read: Shukra Gochar 2022: మీ జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉన్నాడా? దాని లక్షణాలు, పరిహారాలు తెలుసుకోండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook