Budh Gochar In Mithun Rashi: 2023 సంవత్సరంలో కొన్ని గ్రహాలు శుభ మరియు అశుభ యోగాలను ఏర్పరచనున్నాయి. కొత్త ఏడాది ప్రారంభంలో మెర్య్కూరీ గ్రహం మిథునరాశిలో ప్రవేశించనుంది. దీని కారణంగా భద్ర రాజయోగం ఏర్పడనుంది. దీని ప్రభావం అన్ని రాశులవారిపై కనిపిస్తుంది. ఈ భద్ర రాజయోగం (Bhadra Rajyog) కారణంగా ఈ నాలుగు రాశులవారు ఊహించని లాభాలను పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
మిథునం (Gemini): భద్ర రాజయోగం మిథున రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే మీ జాతకంలో ఏడవ ఇంట్లో ఈ యోగం ఏర్పడబోతోంది. అందుకే ఈ సమయంలో మీ వైవాహిక జీవితం బాగుంటుంది. దీంతో పాటు మీ లైఫ్ పార్టనర్ సహకారం కూడా లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. భాగస్వామ్యంతో చేసే పనుల్లో మీరు విజయం సాధిస్తారు. పెళ్లికాని యువతీ యువకులకు వివాహం కుదిరే అవకాశం ఉంది.
కన్య (Virgo): భద్ర రాజయోగం కన్యా రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశి నుండి ఎనిమిదవ ఇంట్లో ఈ యోగం ఏర్పడుతుంది. దీంతో మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీ అదృష్టం ప్రకాశిస్తుంది. ఈ రాశివారు ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఫ్యామిలీతో సంతోషం నెలకొంటుంది. మెుత్తానికి ఈ సమయం సూపర్ గా ఉంటుంది.
ధనుస్సు (Sagittarius): భద్ర రాజయోగం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి వ్యాపారం నిమిత్తం మీరు ప్రయాణం చేసే అవకాశంఉంది. షేర్ మార్కెట్, బెట్టింగ్ మరియు లాటరీలో డబ్బు పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు లాభాలను పొందుతారు. కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. బిజినెస్ లో భారీగా లాభాలు ఉంటాయి.
Also Read: Shani Dev: కుంభరాశిలో శనిదేవుడు ఉదయం... ఈ 3 రాశులవారిని వరించనున్న అదృష్టం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook