Budh Gochar: 2024లో డబుల్ రాజయోగం.. ఈ 3 రాశులకు ప్రభుత్వం ఉద్యోగం పక్కా..

Budh Gochar 2024: న్యూ ఇయర్ లో బుధుడు రాశిలో మార్పు రాబోతుంది. దీని కారణంగా అరుదైన రాజయోగాలు ఏర్పడబోతున్నాయి. ఈ యోగాలు ఏయే రాశులవారికి అదృష్టాన్ని ఇవ్వబోతుందో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 18, 2023, 06:55 PM IST
Budh Gochar: 2024లో డబుల్ రాజయోగం.. ఈ 3 రాశులకు ప్రభుత్వం ఉద్యోగం పక్కా..

Benefits of Rajayoga 2024:  కొత్త సంవత్సరంలో బుధుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఈ రాశిలో మెర్క్యూరీ చాలా బలహీనంగా ఉంటాడు. మీనరాశిలో బుధుడు ప్రవేశం వల్ల నీచభంగ రాజయోగం, మహాధన రాజయోగం ఏర్పడబోతున్నాయి. ఇలా జరగడం 100 సంవత్సరాల తర్వాత ఇదే తొలిసారి. ఈ రెండు రాజయోగాలు వల్ల 2024లో కొన్ని రాశులవారికి అదృష్టం పట్టనుంది. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం. 

వృషభం: 
వృషభ రాశి వారికి రెండు రాజయోగాలు మంచి ఫలితాలను ఇస్తాయి. మీ సంపద పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. దంపతులకు సంతానప్రాప్తి కలుగుతుంది. ఈ సమయంలో స్టాక్ మార్కెట్, బెట్టింగ్ మరియు లాటరీలో పెట్టుబడి పెట్టడం వల్ల లాభాలను పొందుతారు. 
కర్కాటకం: 
మహాధన రాజయోగం మరియు నీచభంగ రాజయోగం కర్కాటక రాశి వారికి మేలు చేస్తుంది. మీ కోరికలు నెరవేరుతాయి. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. విదేశాల్లో చదువుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. ఉద్యోగ మరియు వ్యాపార నిమత్తం మీరు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. మీ ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. 
మిథునం:
మహాధన, నీచభంగ రాజయోగాలు మిథునరాశి వారికి చాలా లాభాలను ఇస్తాయి. 2024లో మీ కెరీర్ అద్బుతంగా ఉండబోతోంది. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బాగుంటుంది. బిజినెస్ చేసేవారు భారీగా లాభాలను పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ ఆఫర్లు వస్తాయి. జాబ్ చేసేవారికి జీతం పెరగడంతోపాటు ప్రమోషన్ కూడా లభిస్తుంది. 

Also Read: Grahan in Telugu: 2024లో సూర్య, చంద్ర గ్రహణాలు ఎప్పుడు? రాశులపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News