Dussehra 2023: శరన్నవరాత్రుల్లో చివరి రోజున వాహన పూజ, కన్యా పూజ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ రెండు పూజలు చేసిన తర్వాత దుర్గామాత అనుగ్రహం కోసం కొంతమంది ఉపవాసాలు విరమిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఉపవాసాలు విరమించుకునేవారు తప్పకుండా దశమి తిథి రోజున మాత్రమే విరమించుకోవాల్సి ఉంటుంది. ఈరోజు కన్య పూజలు చేయడం వల్ల సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి, దుర్గాదేవిల అనుగ్రహం లభిస్తుందని పురాణాల్లో పేర్కొన్నారు.
ఆశ్విజ మాసంలోని శుక్ల పక్ష నవమిని మహానవమి అని కూడా అంటారు. ఈ సంవత్సరం అక్టోబర్ 23వ తేదీ సోమవారం వచ్చింది. అయితే ఈరోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల కోరుకున్న కోరికలు సులభంగా నెరవేరుతాయి. అంతేకాకుండా ఈరోజు వాహన పూజ చేయడం కూడా ఆనవాయితీగా వస్తోంది.
నవమి ప్రత్యేక సమయాలు:
నవమి తిథి అక్టోబర్ 22న రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. తర్వాత అక్టోబర్ 23వ తేదీన సాయంత్రం 5 గంటల 40 నిమిషాలకు ముగుస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. నవమి వ్రతాన్ని ఆచరించేవారు అక్టోబర్ 24వ తేదీన వ్రతాన్ని విరమించుకోవడం మంచిదని శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.
సర్వార్థ సిద్ధి, రవి యోగం శుభ కలయిక:
ఈ సంవత్సరం శరన్నవరాత్రుల్లోని చివరి రోజు సర్వార్థ సిద్ధి, రవి యోగాలు ఏర్పడబోతున్నాయి. నవమి రోజున రవి యోగం రోజంతా ఉంటుంది. సర్వార్థ సిద్ధి యోగం ఉదయం 06:27 నుంచి సాయంత్రం 05:14 వరకు ఉంటుంది. ఈ రెండు యోగాలు ఎంతో పవిత్రమైనవి కాబట్టి ఈ సమయాల్లో ఎలాంటి పూజలు అయినా నిర్వహించుకోవచ్చు. అంతేకాకుండా వ్యాపారాలు ప్రారంభించే వారు ఈ సమయాల్లో ప్రారంభించవచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
నవమి పూజ సమయం:
బ్రహ్మ ముహూర్తం : ఉదయం 04:45 నుంచి 05:36 వరకు..
అభిజిత్ ముహూర్తం: ఉదయం 11:43 నుంచి 12:28 వరకు
విజయ ముహూర్తం: సాయంత్రం 01:58 నుంచి 02:43 వరకు
సంధ్యా ముహూర్తం: సాయంత్రం 05:44 PM నుంచి 06:09 వరకు
అమృత కాలము: ఉదయం 07:29 నుంచి 08:59 వరకు
నిశిత ముహూర్తం: సాయంత్రం అక్టోబర్ 24, 11:40 నుంచి 12:31
రవియోగం: రోజంతా
సర్వార్థ సిద్ధి యోగం: ఉదయం 06:27 నుంచి 05 వరకు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.